కావాల్సిన పదార్థాలు:
క్యారెట్లు- నాలుగు
పాలు- ఒక లీటర్
ఎండు ద్రాక్ష- పది
యాలకులు- నాలుగు
పంచదార- ఒక కప్పు
పిస్తాపప్పులు- పది
నెయ్యి- ఒక కప్పు
జీడిపప్పు- అర కప్పు
బాదంపప్పు- పది
తయారీ విధానం:
ముందు క్యారెట్లను తీసుకుని ఉప్పు నీటిలో బాగా శుభ్రం చేసుకోవాలి. అనంతరం క్యారెట్లను తురుమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయ్యాక.. అందులో జీడిపప్పు, పిస్తాపప్పులు, ఎండు ద్రాక్ష మరియు బాదం పప్పు ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పడు వాటిని ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్‌లో ముందుగా తురుముకున్న క్యారెట్ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. క్యారెట్ బాగా వేగిన తర్వాత అందులో పాలు వేసి పది నిమిషాల వరకూ ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరపడేవరకూ ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో పంచదార, యాలకులు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగేవరకూ ఉడికించాలి.
హల్వా బాగా ఉడికింది అనుకున్నాక.. చివరిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తాపప్పులు, ఎండు ద్రాక్ష మరియు బాదం పప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే యమ్మీ యమ్మీ క్యారెట్ హల్వా రెడీ అయినట్లే. ఈ క్యారెట్ హల్వాను వేడిగానైనా తినవచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత కూడా తినవచ్చు. ఎలా తిన్నా క్యారెట్ హల్వా టేస్టీగా ఉంటుంది. సో.. ఎంతో రుచికరమైన ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి.. ఎంజాయ్ చేయండి.