మాంసాహార ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం.అయితే ఎప్పుడు చేసేవిధంగా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా చేసి మీ ప్రియమైన వారి దగ్గర మార్కులు కొట్టేయండి.  వీకెండ్స్ లో ప్రయోగాలు చేసి  ఒక కొత్త రుచిని ఆస్వాదించండి.   మీకోసం ఒక స్పెషల్ చికెన్ రిసిపిని పరిచయం చేస్తున్నాం.చాలా సింపుల్ రిసిపి. అంతే కాదు, టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఆ రిసిపి ఏంటంటే గార్లిక్ చికెన్ కూర . గార్లిక్ చికెన్ కాంబినేషన్ రెసిపిని మీరు ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ వంటకు కావల్సిన పదార్థాలేంటి, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..!!

 

కావల్సిన పదార్థాలు: 

చికెన్: 1kg శుభ్రం చేసినది 
కుకింగ్ ఆయిల్: 3 టేబుల్ స్పూన్స్ 
బటర్:1 tbs 
ఉల్లియపా: 1 పెద్దది 
ఎండు మిర్చి : 15 
వెల్లులి రెబ్బలు: 10 
పెరుగు: 1 కప్పు 
పసుపు: 1 tbsp 
ఉప్పు: రుచికి సరిపడా 
జీలకర్ర: 1tbsp
కొత్తిమీర - కొద్దిగా 
అల్లం - కొంచెం 

 


తయారుచేయు విధానం : 

 

రెడ్ గార్లిక్ చికెన్ తయారుచేయడానికి ముందుగా ఎండు మిర్చి, వెల్లుల్లిని వేడి నీటిలో వేసి కొద్ది సమయం నానబెట్టాలి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి, పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే చిన్న అల్లం ముక్క వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ ను స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్ద్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.  తర్వాత అందులోనే చికెన్, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నప్పుడు, ముందు గా మిక్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా అందులో వేసి కొద్ది నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు, జీలకర్ర వేసి మిక్స్ చేయాలి. 

 

IHG

 

సరిపడా నీళ్ళు కలిపి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి, విజిల్ పెట్టి..రెండు, మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆపేయాలి. బాగా ఎక్కువ మంట మీద కాకుండా ఒక మాదిరిగా మంట పెట్టి  విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి, కొంచెం కొత్తిమీర చల్లి  వేడి వేడి అన్నంతో హాట్ హాట్ గా రెడ్ గార్లిక్ చికెన్ గ్రేవీని సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: