కావాల్సిన ప‌దార్థాలు:
చేప ముక్కలు - ఆరు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక‌ టీ స్పూన్‌
పచ్చి మిర్చి - నాలుగు
కరివేపాకు - రెండు రెబ్బ‌లు

 

ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
ప‌సుపు- అర టీ స్పూన్
టమాటా ముక్కలు - అర‌ కప్పు
ధనియాల పొడి - అర టీ స్పూన్‌

 

మెంతి పొడి - అర టీ స్పూన్‌
జీలకర్ర పొడి - అర టీ స్పూన్‌
గరం మసాలా పొడి - ఒక టీస్పూన్‌

 

చింత పండు రసం - పావు కప్పు
ఉప్పు - రుచికి స‌రిప‌డా
నూనె - సరిపడినంత 
కొత్తి మీర త‌రుగు - ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా నీటిలో చేపముక్కలు కడిగి.. ఆ త‌ర్వాత చేప‌ల్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి కలిపి అరగంట పాటూ పక్కన పెట్టాలి. అనంత‌రం స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి కాస్త నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక‌ చేప ముక్కల్ని బాగా వేయించి పక్కన పెట్టాలి. 

 

ఇప్పుడు పాన్‌లో  మరికొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర, కారం, టమాటా ముక్కలు వేసి ప‌ది నిమిషాలు వేయించాలి. ఆ త‌ర్వాత అందులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ఆ సమయంలో చింతపండు రసం కూడా వేసేయాలి. 

 

నీళ్లు తగ్గి ఇగురులా అవుతున్నప్పుడు ముందుగా వేయించిన చేపల్ని అందులో వేయాలి. చేపముక్కలకి ఇగురు అంటేలా ఒక్కో ముక్కని కలపాలి. ఇప్పుడు అందులో కాస్త మెంతి పొడి, మసాలా చల్లి మళ్లీ కలపాలి. ఇక దించేముందు కొత్తి మీర వేస్తే స‌రిపోతుంది. అంతే వేడివేడి చేపల కుర్మా రెడీ అయినట్టే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అందిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ చేపల ‌కుర్మా మీరు కూడా త‌యారుచేసుకుని ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: