ఆషాడ మాసంలో శరీరంలో ఎంత వేడి ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆషాఢమాసం వచ్చింది అంటే చాలు గోరింటాకు పెట్టుకోమని సలహాలు ఇస్తారు పెద్దలు. ఎందుకంటే శరీరంలో వేడి తగ్గుతుంది అని. ఇంకా అలానే ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి తింటే కూడా శరీరంలో వేడి తగ్గుతుంది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి తినండి.. శరీరంలో వేడి తగ్గించుకొని ఆరోగ్యాన్ని పెంచుకోండి.
కావాల్సిన పదార్ధాలు..
పొట్లకాయ- 1,
అల్లం- అరా అంగుళపు ముక్క,
గట్టి పెరుగు - పావుకిలో,
పచ్చి మిర్చి- 3,
ఎండు మిర్చి-1,
మినప పప్పు- అరచెంచా,
జీలకర్ర, ఆవాలు- పావు చెంచా,
ఇంగువ- చిటికెడు,
కరివేపాకు -2 రెమ్మలు,
నూనె- 2 చెంచాలు,
ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం..
పొట్లకాయను కడిగి ముక్కలుగా తరగాలి. ఒక పాన్ లో తగినంత నీరు పోసి అందులో ఈ ముక్కలు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఇంకా అవి ఉడికిన తర్వాత.. అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇంకా అనంతరం ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని మీగడ తరకలు లేకుండా గరిటతో కలిపి అల్లం, పచ్చి మిర్చి ముద్ద కలుపుకోవాలి. ముక్కలు తీసి అవి చల్లారాక నేరుగా పెరుగులో కలపాలి. చివరగా చక్కగా పోపు పెట్టుకొంటే పచ్చడి రెడీ. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని చెపాతీలో లేదా అన్నంలోకి కలుపుకొని తినండి.. శరీరంలో వేడిని తగ్గించుకోండి.