కావాల్సిన ప‌దార్థాలు:
మటన్ ముక్కలు - అరకిలో
ఉల్లిపాయ ముక్క‌లు - ఒక క‌ప్పు
గరం మసాలా - ఒక టీ స్పూను

 

చింతపండు - కొద్దిగా
కరివేపాకు - నాలుగు రెబ్బ‌లు
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు

 

జీలకర్ర - రెంటు టీస్పూన్లు
పండు మిర్చి - ఎనిమిది
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు

 

ఉప్పు - తగినంత
కొత్తిమీర త‌రుగు - ఒక క‌ప్పు
పుదీనా త‌రుగు - ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం:
ముందుగా నీటిలో మటన్ ముక్కల్ని శుభ్రంగా క‌డిలి పెట్టుకోవాలి. అనంత‌రం మ‌ట‌న్ ముక్క‌ల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి బాగా ప‌ట్టించాలి.  ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో మ‌ట‌న్ ముక్క‌లు వేసి పావు గంట పాటు ఉడికించాలి. 

IHG

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని గరం మసాలా, జీలకర్ర, పండుమిర్చి కలిపి పేస్ట్ చేయాలి చేయాలి. ఆ త‌ర్వాత‌ స్టవ్ మీద పాన్ పెట్టి సరపడినంత నూనె వేసి  కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కులు వేగాక మిక్సీ చేసుకున్న పండుమిర్చి పేస్ట్‌, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మళ్లీ వేయించాలి. అనంత‌రం ముందుగా ఉడ‌క‌బెట్టుకున్న‌ మటన్ ముక్కల్ని ఇందులో వేయాలి.

IHG

అయిదు నిమిషాలు వేపాక చింతపండు రసాన్ని వేయాలి. ఇప్పుడు పైన మూత పెట్టి బాగా ఉడికించాలి. నీరంతా ఇంకిపోయే వ‌ర‌కు బాగా ఫ్రై చేయాలి. లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే మటన్ చిల్లీఫ్రై రెడీ అయిన‌ట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ మటన్ చిల్లి ప్రైను మీరు కూడా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: