అరటి కాయతో కూడా రైతా తయారు చేసుకుని తినవచ్చు. అసలు దానికి కావాల్సినవి ఏంటీ అనేది చూస్తే...
అరటి కాయ – ఒకటి తీసుకోండి... పెరుగు – పావు కేజీ లేదా మీరు ఎంత తింటే అంత. జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్, ఆవాలు - అర టీ స్పూన్, మినప్పప్పు - అర టీ స్పూన్, ఎండు మిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారీ చూస్తే.. కుక్కర్‌లో అరటి కాయలు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి... ఒక పాత్రలో పెరుగు తీసుకుని గట్టిగా లేకుండా చిలకరించాలి... ఇప్పుడు అందులో అరటి కాయ గుజ్జు, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకుని కలపాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసి వేయిన్చుకోవాల్సి ఉంటుంది. ఎండు మిర్చి, కరివేపాకు వేసి కలపాలి. ఈ పోపుని రైతాపై పోసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వెజ్ బిర్యానికి అయితే ఇది సూపర్ గా ఉంటుంది.