కావలసిన పదార్థాలు:
1)మటన్ -1/2 kg
2)ఉల్లిపాయలు -2 పెద్దవి
3) లవంగాయాలు -4
4)మిరియాలు -సరిపడా
5)యాలక్కాయలు -2
6)ధనియాల పొడి -2 టేబుల్ స్పూన్స్
7)పచ్చిమిరపకాయలు -2
8)దాల్చిన చెక్క -సరిపడా
9)కారం -2 టేబుల్ స్పూన్స్
10)ఉప్పు -సరిపడా
11)వేరుశెనగనూనె - 100gm
12)నెయ్యి - 3 టేబుల్ స్పూన్స్
13)పసుపు -చిటికెడు
14)అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 టేబుల్ స్పూన్స్
15)పెరుగు - 1/2కప్పు
16)కొత్తిమీర -కొంచం
తయారీ విధానం :
ముందుగా మటన్ ముక్కల్ని శుభ్రంగా నీటితో కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి పాన్ తీసుకుని అందులో ముందుగా కడిగి ఉంచుకున్న మటన్ ముక్కల్ని వేయాలి. ఈ మటన్ ముక్కలు లోనే కొంచెం మిరియాలు కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక రెండు యాలక్కాయలు కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత సరిపడా కారం, ఉప్ప, పసుపు, ధనియాల పొడి కూడా వేసి మొత్తం ఒక సారి కలపాలి. ఇందులోనే తాజాగా తయారు చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలపాలి. ఆ మటన్ ముక్కలోనే బాగా గట్టిగా ఉన్న తాజా పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలిపి మ్యారినేట్ అయ్యేవరకు ఒక రెండు లేదా మూడు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇలా నాన పెట్టడం వల్ల మటన్ ముక్కలకు మాసాల దినుసులు, ఉప్పు, కారం బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేసి కాగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాక వేపాలి. మరి ఎక్కువగా వేగనియ్యకండి మాడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయముక్కలని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుండి ముందుగా కలిపిపెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని తీసి అందులో కొంచెం నెయ్యి కలపాలి. నెయ్యి కలిపాక ఒక ఐదు నిముషాలు ఉంచి అదే బాండితో పొయ్యి మీద పెట్టాలి.ఒక 30 నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా మటన్ ఉడకనివ్వాలి.
30 నిమిషాలు అయ్యాక ఆ బాండీలో ముందుగా పేస్ట్ చేసుకున్నా ఉల్లిపాయ పొడిని వేసి తిప్పాలి. తర్వాత ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసి కూర ఒక్కసారి తిప్పి మూత పెట్టాలి. ఒక 15 నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వాలి.ఉప్పు కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు.. తరువాత కొద్దిగా గరం మాసాల చల్లాలి. మటన్ ముక్క మెత్తగా ఉడకనివ్వాలి. ఎప్పుడయితే కూరలోని నూనె సెపరేట్ అయ్యి కూర పైన కనిపిస్తుందో అప్పుడే కూర ఉడికినట్లు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ముందే పొయ్యి మీద నుంచి దించేయాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మటన్ కుర్మా రెడీ..!ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి మటన్ కుర్మా వండేటప్పుడు స్టవ్ ఎప్పుడు మీడియం మంట మీద మాత్రమే పెట్టుకుని వండాలి అప్పుడే కుర్మా చాలా చిక్కగా, రుచికరంగా ఉంటుంది..