చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.  కొంతమందికి అయితే నాన్ వెజ్ లేకపోతే అన్నం తిన్న ఫీల్ ఉండదు.అందుకనే ఈసారి మనం రెగ్యులర్‌గా చికెన్ కర్రీ వండుకున్నట్లు కాకుండా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం నోరూరించే లెమన్ చికెన్ తయారు చేసేద్దాం.. ! ఈ కర్రీ ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు లెమన్ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

చికెన్ – 1/2 కేజీ
ఉప్పు – తగినంత
మిరియాల పొడి – 1/2 టీ స్పూన్
మైదా – 1/4 కప్పు
బటర్ – 4 టేబుల్ స్పూన్లు
ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – 1/3 కప్పు
కొత్తిమీర – కొద్దిగా
పసుపు -చిటికెడు
కారం -కొంచెం

తయారుచేయు విధానం :

ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలపై ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా కారం చల్లండి.ఒక గిన్నెలో మైదాపిండి తీసుకుని ముక్కల్ని మైదా పిండిలో ముంచి తియ్యండి. తర్వాత ఒక పాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి అయ్యాక  చికెన్ ముక్కల్ని అందులో వేసి 2 నుంచి 3 నిమిషాలు వేపండి.సన్నని మంట మీద వేపాలి. తర్వాత ముక్కల్ని  తిరగేసి మళ్లీ 2 నుంచి 3 నిమిషాలు వేపాలి. బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ ముక్కలపై నిమ్మరసం వేసి అలా రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చెయ్యాలి. ఇప్పుడు వాటిపై మిగిలిన 2 టేబుల్ స్పూన్ల బటర్ వెయ్యాలి. బటర్ కరిగే వరకూ ముక్కల్ని అటూ ఇటూ కదపాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి లెమన్ చికెన్ రెడీ అయినట్లే.ఈ కర్రీ తినడానికి చాలా రుచిగా పుల్లగా ఉంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: