అటుకులు లైట్ ఫుడ్.. ఇక అటుకులతో చేసే ఏ వంట అయిన కూడా చాలా రుచిగా ఉంటుంది.అందుకే ఈ అటుకులను స్నాక్ ఐటమ్స్ లలో ఎక్కువగా వాడుతుంటారు. అటుకులను కొన్ని ప్రాంతాల్లో పోహా అని కూడా అంటారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తో ప్రజలు ఎక్కడికి పొలేకున్నారు.. ఏది తినలేకున్నారు.. వర్షాకాలం కావున ఏదైనా వేడిగా, రుచిగా, చిటికెలో అయిపోయెలా ఉండే వంట చేసుకోవాలని అనుకుంటారు. మరి ఆలస్యమెందుకు అటుకులతో చిటికెలో అయిపోయే బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
అటుకులు : ఒక కప్పు
పచ్చి బఠాణీ : రెండు స్పూన్లు
ఉప్పు : తగినంత
పల్లీలు : రెండు స్పూన్లు
నిమ్మరసం : ఒక టేబుల్ స్పూను
కరివేపాకు : రెండు రెబ్బలు
కొత్తీ మీర. : గార్నిష్ కోసం
తయారీ విధానం :
ముందుగా అటుకులను ఒక బౌల్ లో తీసుకొని నీరు పోసి గట్టిగా పిండి వేరే గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత
స్టవ్ ఆన్ చేసి,ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల
నూనె వేసి వేడయ్యాక పల్లిలో, పచ్చి
మిర్చి,
వెల్లుల్లి ముక్కలు,పసుపు, కరివేపాకు,జీలకర్ర వేసి వేయించాలి. అవి వేగాక సన్నగా తరిగిన
ఉల్లిపాయ ముక్కలు,పచ్చి బఠాణీ కూడా వేసి వేయించాలి.ఒక నిమిషం పాటు వేయించాక అటుకులను వేసి పోపు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. నిమ్మరసం వేసి అటుకులకు పట్టుకొనెలా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి.
స్టవ్ ఆఫ్ చేసి కొత్తీ మీర తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకులతో
ఉప్మా రెడీ.. ఇందులో కావాలని అనుకునే వారు పుట్నాల పప్పు , కారం, ఉప్పు,
వెల్లుల్లి వేసి తయారు చేసుకున్న పొడిని కూడా వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.