మన భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలు ఉండటం తర తరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇక పోతే మన ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. పండుగలకు చాలా మంది ఉపవాసాలు ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేక వంటలు చేసి తినడం ముఖ్యం. అలాంటి వంటకాల్లో ఒకటే కుట్టు కే పకోడా..దీని రుచి మాములుగా ఉండదు. ఒక్కసారి తిన్నారంటే ఇక ఎప్పటికి మరిచిపోరు. నవరాత్రి, దసరా వంటి పండుగల్లో ఎక్కువగా చేసుకునే ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది. తృణధాన్యాల్లో ఒకరకమైన బుక్ వీట్‌ పిండితో ఈ రెసిపీని తయారు చేస్తారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి...  

కావాల్సిన పదార్ధాలు...

ప్రధాన పదార్థం...

1 కప్ బక్వీట్
2 ఉడకబెట్టిన  బంగాళాదుంపలు
ప్రధాన వంటకానికి
1 టీ స్పూన్ సెందా నమక్
1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర
1 టీ స్పూన్ మిరియాలు
అవసరాన్ని బట్టి నీళ్ళు
అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె.

తయారుచేసే విధానం....

ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో పిండిని వేయండి. ఇప్పుడు అందులోనే అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, నల్లమిరియాల పొడి, ఉప్పు వేసి పదార్థాలన్నీ కలిసిపోయేలా బాగా కలపండి. ఇప్పుడు నీరు వేసుకుని బజ్జీల పిండిలా కలపండి.. మరి జారుడుగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపినట్లుగా కలపండి.

ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలను పిండిలో ముంచుతూ వేడి నూనెలో వేయండి. పకోడాలకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూడండి.. మీడియం మంటపై మెల్లిగా వేయించండి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకూ వేయించండి. ఇలా వేగిన వాటిని సర్వింగ్ ‌బౌల్‌లో వేయండి..

ఇలా తయారైన పకోడాలను చట్నీ, సాస్‌లతో సర్వ్ చేయండి. ఇది ఉపవాస దీక్షలకి పర్ఫెక్ట్‌గా సరిపోయే వంటకం.

మరింత సమాచారం తెలుసుకోండి: