కావలిసిన పదార్ధాలు
1)చికెన్ -500
2) నూనె -సరిపడా
3)జీలకర్ర -1/2 స్పూన్
4)అల్లం, వెల్లుల్లి పేస్ట్ -1 1/2 స్పూన్
5)ఉప్పు -సరిపడా
6)గరం మసాలా - 1/2 టీ స్పూన్
7)పసుపు -చిటికెడు
8)ఉప్పు -సరిపడా
9)ధనియాల పొడి -1/2 టీ స్పూన్
11)కొత్తిమీర - 1 cup
12)పుదీనా -1 కప్
13)ఉల్లిపాయ -1
14)పచ్చిమిర్చి -3
15)కారం - సరిపడా
16)నీళ్లు -తగినన్ని
తయారు చేయు విధానం :
ముందుగా చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి.. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కార్డుమామ వేసి బాగా మెత్తని పేస్ట్ ల చేసుకోవాలి. నీరు మాత్రం ఎక్కువగా పోయకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి కొంచెం నూనె పోయాలి. నూనె కాగాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి వేపాలి.తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపాలి.అందులో ముందుగా కడిగిపెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి వేపాలి. ఒక రెండు నిముషాలు అయ్యాక కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒకసారి తిప్పి సన్నని మంట పెట్టి మూతపెట్టాలి. ఒక 5 నిముషాలు అయ్యాక చికెన్ లో ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి బాగా కలపాలి. ఒక 4 లేదా 5 నిముషాలు పచ్చివాసన పోయేదాకా వేపాలి.తర్వాత సరిపడా నీళ్లు పోసి బాగా తిప్పి మూతపెట్టి ఉడకనివ్వాలి..పచ్చిమిర్చి ఘాటు చాలదు అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిముషాలు అయ్యాక గ్రేవీ అంతా చిక్కపడ్డాక ఉప్పు చూసుకుని వేసుకోవాలి. కూర దగ్గర పడి నూనె కనపడిన వెంటనే దించేయాలి.. ఇలా నీళ్లు కాకుండా కొబ్బరి పాలు పోసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర అన్నంలో తిన్న, రోటిలో తిన్నాగాని భలే రుచిగా ఉంటుంది.. సర్వ్ చేసేముందు కాస్త నిమ్మరసం పిండితే చాలా బాగుంటుంది.. !!