ప్రపంచవ్యాప్తం గా గార్లిక్ బ్రెడ్ చాలా మందికి ఫేవరేట్. బాగా పాప్యులర్ కూడా. పాస్తా తో, సూప్ తో బాటూ తినడానికి గార్లిక్ బ్రెడ్ బావుంటుంది. గార్లిక్ బ్రెడ్ స్టార్టర్ గా తీసుకోవచ్చు, స్నాక్ గా కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇంత రుచికరమైన గార్లిక్ బ్రెడ్ ని కొంచెం తిని ఎవరం ఆగలేం. టోస్ట్ చేయబడి, చీజ్, బటర్ తో మిలమిలా మెరుస్తూ ఉండే గార్లిక్ బ్రెడ్ కి పెద్ద ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ గార్లిక్ బ్రెడ్ ని రెస్టారెంట్స్ లోనే తినాల్సిన పని లేదు. ఇంట్లోనే హెల్దీ గా తయారు చేసేసుకోవచ్చు. ఎలాగో చూడండి మరి. ఇక్కడ ఒక గార్లిక్ బ్రెడ్ రెసిపీ ఉంది. ఇలా చేస్తే బ్రెడ్ తొందరగా తేలికగా అయిపోతుంది. ఇందులో నాలుగే నాలుగు ఇన్‌గ్రీడియెంట్స్ ఉన్నాయి.
మల్టీ-గ్రెయిన్ గార్లిక్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు:
బటర్ - నాలుగు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెమ్మలు - ఐదు
మల్టీ గ్రెయిన్ బ్రెడ్ - ఒకటి
చిల్లీ ఫ్లేక్స్ - ఒక టీ స్పూన్
మైదా పిండి - 3/4 కప్పు
గోధుమ పిండి - 2 కప్పులు, ఇంకొంచెం
రాగి పిండి - 3/4 కప్పు
ఇన్స్టంట్ ఓట్స్ - 1 కప్పు
యీస్ట్ - ఒక టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా - ఒకటిన్నర టీ స్పూన్
షుగర్ - 3 టేబుల్ స్పూన్లు
సాల్ట్ - 2 టీ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
గోరు వెచ్చని నీరు - తగినంత
నువ్వులు - పైన చల్లడానికి తగినన్ని
తయారు చేసే పద్ధతి:
1. ఒవెన్ ని 200 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేయండి.
2. ఒక బౌల్ లో షుగర్, యీస్ట్ తీసుకుని అందులో పావు కప్పు వెచ్చని నీరు పోయండి. ఐదు నిమిషాలు అలా వదిలేస్తే యీస్ట్ యాక్టివేట్ అవుతుంది.
3. ఇన్స్టంట్ ఓట్స్ ని ఒక బౌల్ లో తీసుకుని అందులో వెచ్చని నీరు పోయండి. పది నిమిషాలు అలా వదిలేస్తే ఓట్స్ నీటిలో డిసాల్వ్ అయిపోతాయి.
4. ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా, ఈస్ట్ వాటర్ వేసి బాగా కలపండి.
5. ఇందులోనే గోధుమ పిండి, మైదా పిండి, రాగి పిండి వేసి మళ్ళీ బాగా కలపండి.
6. ఇందులో ఉప్పు వేసి పిండిని బాగా ముద్ద చేయండి.
7. కొంచెం నూనె చల్లి మళ్ళీ ముద్ద చేయండి.
8. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఆయిల్ రాసిన ఒక బౌల్ లోకి మార్చి కవర్ చేసి ఉంచితే పిండి బాగా పొంగుతుంది.
9. ఇప్పుడు దాన్ని బైటికి తీసి బాగా నీడ్ చేస్తే గాలి బయటకి పోతుంది. ఇంకొంచెం గోధుమ పిండి చల్లి మరో ఐదు నిమిషాలు బాగా ముద్ద చేయండి.
10. ఇప్పుడు దీన్ని బ్రెడ్ లోఫ్ షేప్ లోకి తెచ్చి బాగా ఆయిల్ రాసిన లోఫ్ టిన్ లో ఉంచండి.
11. మళ్ళీ దీన్ని కవర్ చేసి ఒక గంట సేపు ఉంచితే మళ్ళీ పొంగుతుంది.
12. ఇప్పుడు దీని పైన కొంచెం ఆయిల్ రాసి ఆ పైన నువ్వులు చల్లండి.
13. ప్రీ-హీటెడ్ ఒవెన్ లో 45 నుండి 50 నిమిషాలు బేక్ చేయండి.
14. తరువాత దీన్ని బైటకు తీసి కొంచెం చల్లారనివ్వండి.
15. ఆ తరువాత లోఫ్ టిన్ లో నుండి కూడా బైటకు తీసి స్లైసెస్ గా కట్ చేసుకోండి.