ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సాధారణంగా అందరు బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లినో దోసనో తీసుకుంటారు. కాని వాటికి బదులు ఈ వెన్ పొంగల్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సౌత్ ఇండియా లోనే మంచి రుచికరమైన బ్రేక్ ఫాస్ట్. ఇది పిల్లలకి అలాగే వ్యాధి గ్రస్తులకి చాలా ఆరోగ్యమైన ఆహారం. ఇది పొద్దున పూట రోజు చిన్న పిల్లలు తింటే వారికి మంచి బలం వస్తుంది. చాలా పుష్టిగా తయారవుతారు. కాబట్టి ఈ రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన వెన్ పొంగల్ ని తప్పకుండా తీసుకోండి. వెన్ పొంగల్ అనేది దక్షిణాదిలో మంచి బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్. ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ ఎలా చేయాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఇప్పుడు చూద్దాం..


వెన్ పొంగల్ కి కావాల్సిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం...

ముందుగా వెన్ పొంగల్ కి కావాల్సింది పదార్ధాలు....
 

ప్రధాన పదార్థం.....

1 కప్ బియ్యం....

ప్రధాన వంటకానికి...

1 కప్ పెసరపప్పు...

1 కప్ పాలు....

1 కప్ తురిమిన టెంకాయ....

1 టేబుల్ స్పూన్ జీలకర్ర...

1 అంగుళం అల్లం...

5  కత్తిరించి రెండుముక్కలుగా కోసినవి....

 ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు....

అవసరాన్ని బట్టి జీడిపప్పు...

అవసరాన్ని బట్టి కరివేపాకు...

1 టీ స్పూన్ మిరియాలు...

అవసరాన్ని బట్టి పసుపు...

అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా....

5 కప్ నీళ్ళు...

అవసరాన్ని బట్టి ఉప్పు...



వెన్ పొంగల్ తయారు చేయు విధానం....


ముందుగా బియ్యం, పెసరపప్పు కడిగి కుక్కర్‌లో 4 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.

ఇప్పుడు ఉడికిన అన్నం, పెసరపప్పు మిశ్రమాన్ని మెత్తగా చిదమాలి. తర్వాత అందులోని తురిమిన కొబ్బరి పొడి, మిగతా పదార్థాలు వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఓ పాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడి అయిన తర్వాత జీలకర్ర వేయాలి. తర్వాత అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పులు వేసి వేయించాలి. జీడిపప్పులు కొద్దిగా రంగు మారగానే అందులో మిరియాలు, పసుపు, కొద్ది ఇంగువ, కరివేపాకులు వేసి బాగా కలపాలి.




ఇలా తయారైన పోపు మిశ్రమాన్ని బియ్యం మిశ్రమంలో వేయండి. అదే విధంగా పాలు వేసి బాగా కలపండి. వేసిన పదార్థాలన్నీ బాగా కలిశాక.. కొద్దిగా ఉప్పు వేసి మరోసారి కలపండి.

ఇలా తయారైన పొంగల్‌ని ఓ బౌల్‌లో తీసుకుని పై నుంచి కొద్దిగా నెయ్యి వేసి గార్నిష్ చేయండి. ఇలా తయారైన పొంగల్‌కి రైతా మంచి కాంబినేషన్.

ఇలాంటి మరిన్ని కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: