ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పకోడీ చాలా రుచికరమైన స్నాక్ ఐటమ్. ఈ పకోడీ బాలానికి చాలా మంచిది. అయితే మామూలు పకోడీ కాకుండా ఎప్పుడైనా వెజిటేబుల్ పకోడీ ట్రై చేశారా? ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే చాలా రుచికరంగా ఉంటుంది. ఇక సాయంత్రం వేళల్లో చక్కటి చిరు తిండిగా తినటానికి చాలా బాగుంటుంది. ఇక రుచికరమైన ఈ వెజిటేబుల్ పకోడీని ఎలా చేసుకోవాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...


రుచికరమైన వెజిటేబుల్ పకోడికి కావాల్సిన పదార్ధాలు....

శెనగపిండి - ఆరు కప్పులు, బంగాళాదుంపలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, క్యాప్సికమ్ - రెండు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత, డ్రై మ్యాంగో పొడి - రెండు టీస్పూనులు (దొరికితే వాడండి... లేకపోయినా ఫర్వాలేదు), కారం - ఒక టీస్పూను...

వెజిటేబుల్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్ధాలు....

ముందుగా  వెజిటేబుల్ పకోడీ తయారు చెయ్యాలంటే  బంగళాదుంపల పొట్టు తీసేయాలి. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేసి అందులో శెనగపిండి, నీళ్లు పోసి కలపాలి. ఉప్పు , కారం కూడా చేర్చాలి. పకోడీ వేసుకోవడానికి వీలుగా దీనిని కలుపుకోవాలి. అవసరమైనంత మేర నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. దీనిని గ్రీన్ చట్నీతో కానీ, కెచప్ తో కానీ తింటే టేస్టుగా ఉంటుంది.ఇక ఇలాంటి మరిన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి.....

మరింత సమాచారం తెలుసుకోండి: