కావాల్సిన పదార్ధాలు...
పచ్చి బఠానీలు - రెండు కప్పులు, వెన్న - ఒక టీస్పూను, పుదీనా ఆకుల తురుము - ఒక టీస్పూను, ఉల్లిపాయ తరుగు - పావుకప్పు, పాలు - అరకప్పు, బ్లాక్ పెప్పర్ - అర టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నీళ్లు - రెండు కప్పులు
బఠాణి పుదీనా సూప్ తయారీ విధానం...
పచ్చి బఠానీలు కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కాస్త వెన్న వేయాలి. అందులో ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత అందులో పచ్చి బఠానీలు వేసి... నీళ్లు పోయాలి. బఠానీలను ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. బఠానీలు ఉడికిపోయాక... చల్లార్చి, మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో పాన్ పెట్టి అందులో నీళ్లు, పాలు పోసి మరిగించాలి. అవి కాస్త వేడెక్కాక బఠానీ పేస్టుని వేసి కలిపేయాలి. అందులో పుదీనా ఆకులు వేసి మరిగించాలి. బ్లాక్ పెప్పర్ చల్లాలి. మొత్తం మిశ్రమాన్ని మంచి వాసన వచ్చే వరకు చిన్న మంటమీద ఉడికించాలి. ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేయాలి. ఒక బౌల్ లోకి సూప్‌ను తీసుకుని లాగించడమే. టేస్టు కూడా భలేగా ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...