ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇలాంటి బర్డ్ ఫ్లూ కాలంలోనూ అక్కడ చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. కేజీ చికెన్ ధర 1000 నుంచి 4000 వరకు పలుకుతోంది. ఇక మంచి మేలు జాతి కోళ్లయితే అయితే 10వేల వరకు చెల్లించాల్సి వస్తుంది.సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి.
ఈ పందాల్లో ఓడిపోయిన కోళ్లను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారుఏడాది మొత్తం ఈ పందేల కోసం పుంజుల్ని విపరీతంగా ట్రైన్ చేయటమే తెలిసిందే. ఇందుకోసం జీడిపప్పు.. బాదంపప్పు.. పిస్తా పప్పు ఇలా ఖరీదైన ఆహారాన్ని పెడుతుంటారు. పందెం కోసం పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తుంటారు.పుంజులు మంచి దిట్టంగా ఉండడం, కూర రుచిగా ఉండడం, తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్న నమ్మంతో.. చికెన్ ప్రియులు డబ్బులకు వెనుకాడకుండా పందెంలో ఓడిన కోళ్లను కొనేందుకు ఎగబడుతున్నారు.తక్కువ నాణ్యత కలిగిన కోళ్లు ఒక్కోటి రూ.3వేల వరకు ధర పలుకుతుండగా.. దిట్టంగా ఉన్న పుంజులు అయితే ఏకంగా రూ.8-10వేల వరకు అమ్ముతున్నారు. పందెం కోళ్లు మంచి రుచిగా ఉండటంతో పాటు పౌష్టికాహారం కావడంతో వీటిని కొనుగోలు చేసేందుకు జనం ఎగబడుతున్నారు.