ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....వెజిటబుల్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. వెజిటబుల్ రైస్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి గాని మధ్యాహ్నం లంచ్ కి కాని నైట్ డిన్నర్ కి గాని తినటానికి చాలా బాగుంటుంది. అలాగే ఇది మంచి రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఉల్లికాడలతో టేస్టీ వెజిటబుల్ రైస్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసిన రుచే దీనికి వస్తుంది. గ్రీన్ ముక్కలతో చూడడానికి చాలా నోరూరించేలా ఉంటుంది.ఇక ఉల్లి కాడలతో వెజిటబుల్ రైస్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..

ఇక రుచికరమైన వెజిటబుల్ రైస్ తయారు చెయ్యటానికి కావాల్సిన పదార్థాలు....

ఉల్లికాడలు - పది కాడలు,

వండిన అన్నం - ఒక కప్పు,
నిమ్మరసం - రెండు టేబుల్ స్పూనులు,
గ్రీన్ బఠాణీ - పావు కప్పు,
పసుపు - అర టీస్పూను,
సాంబారు పొడి - ఒకటిన్నర స్పూను,
ఉప్పు - సరిపడా,
ఆవాలు - ఒక టీ స్పూను,
మినపప్పు - ఒక టీస్పూను,
కరివేపాకు - నాలుగు రెబ్బలు,
ఎండుమిర్చి - రెండు,
జీడి పప్పు - ఆరు,
నూనె - రెండు స్పూనులు

రుచికరమైన వెజిటబుల్ రైస్ తయారు చేయు విధానం...

ముందుగా ఉల్లికాడల్ని కడిగి మరీ చిన్నగా అలాగని మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూనుల నూనె వేయాలి. అందులో ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. అందులోనే పచ్చి బఠాణి, ఉల్లికాడ ముక్కలు వేసి కూడా వేయించాలి. బాగా వేగాక సాంబార్ పొడి చల్లాలి. ఆ మిశ్రమమంతా వేగాక అందులో అన్నం, ఉప్పు వేసి కలపాలి. పైన వేయించిన జీవిపప్పును చల్లాలి. వేడివేడిగా అతిధులకు హ్యాపీగా వడ్డీంచండి. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: