చికెన్ తో ఎన్నో రుచికరమైన వంటకాలు మనం చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా పార్టీలలో కాని ఏమైనా ఫంక్షన్స్ లో కాని చేసుకోని తినేందుకు చికెన్ స్టిక్స్ చాలా బాగుంటాయి. ఇవి ఎంతో స్పైసిగా క్రీస్పిగా చాలా బాగుంటాయి. ఇక రుచికరమైన ఈ చికెన్ స్టిక్స్ ని ఎలా చెయ్యాలో మీరు తెలుసుకోండి....
కావాల్సిన పదార్ధాలు...
చికెన్ ముక్కలు - 500 g
గరం మసాల - 1 టీస్పూన్
క్రీమ్- 1 కప్
పచ్చిమిర్చి - 5 లేదా 6
వెల్లుల్లి పేస్ట్ -1/2 టీస్పూన్
కార్న్ ఫ్లోర్ - 1 కప్
ఇంగువ - 1/4 టీస్పూన్ కంటే తక్కువ ధనియాల పొడి - 1/2 టీస్పూన్
జీలకర్రపొడి - 1/2 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
నిమ్మరసం - 1/2 టీస్పూన్
బ్రెడ్ పొడి
ఉప్పు
నూనె
తయారుచేయు విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జీలకర్ర, దనియాల పొడి, కారం, వెల్లుల్లి పేస్ట్ మరియు కార్న్ ప్లోర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.తర్వాత మరో బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలను వేయాలి. అలాగే ముందు మిక్స్ చేసిన పదార్థాలన్నీ కూడా వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు సన్నగా తరిగిని పచ్చిమిర్చి, నిమ్మరసం కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.అలాగే అందులో క్రీమ్ కూడా వేసి మొత్తం మిశ్రమం మిక్స్ అయ్యేలా చేసిన పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, నూనె వెడి అయ్యాక అందులో చికెన్ పీసెస్ ను బ్రెడ్ పొడిలో రోల్ చేసి తర్వాత కాగే నూనెలో వేసి డీఫ్ ప్రై చేసుకోవాలి.చికెన్ స్టిక్స్ క్రిస్పీగా, బ్రౌన్ కలర్లో ఉడికే వరకూ అటూ ఇటూ తిప్పుతూ అన్ని వైపులా బాగా కాలేవరకూ ఉండి, తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ చికెన్ స్టిక్స్ రెడీ. వీటిని మీకు నచ్చిన సాస్ తో వడ్డిస్తే చాలా రుచికరంగా ఉంటుంది. వేడి వేడిగా వడ్డిస్తే చాలా టేస్టీగా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన చికెన్ స్టిక్స్ ని మీరు ఇంట్లో ట్రై చెయ్యండి...