బయట ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి.ఆ ఎండ తాకిడి తట్టుకోవడానికి చల్ల చల్లగా ఏదన్నా తాగుదాం అనుకుంటున్నారా.అయితే ఈ సమ్మర్ లో చిటికెలో అయిపోయె సులువైన రెసిపీలు మీ కోసం అందిస్తున్నాము. వాటిలో మొదటగా చల్ల చల్లని రోస్ షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దామా.. !

1)కావాల్సిన పదార్ధాలు

100 ml రోస్ సిరప్

2 tbsps సబ్జా గింజలు

1.25 tbsp నిమ్మరసం

8 - 10 ఐసు ముక్కలు

600 ml చల్లని నీళ్ళు

తయారీ విధానం :

ముందుగా ఒక గిన్నెలో కొన్ని సబ్జా గింజలు.తీసుకుని వాటిలో  నీళ్ళు పోసి అవి ఉబ్బేదాకా నానబెట్టాలి. అవి ఉబ్బిన తరువాత వాటిని ఒక గ్లాసులోకి తీసుకుని అందులో మిగిలిన పదార్ధాలు అయిన  రోస్ సిరప్, ఐస్ క్యూబ్స్ , చల్లని నీళ్ళు,సబ్జా గింజలు,నిమ్మరసం అన్ని  వేసి ఒకసారి కలిపాలి. అంతే రోజ్ షర్బత్ రెడీ అయినట్లే.. ఇది తాగితే మీ శరీరం కూడా చల్ల బడుతుంది.. !!

2)పుదీనా డ్రింక్ :

అలాగే ఈ ఎండాకాలంలో  పుదీనా డ్రింక్ కన్నా ఉత్తమమైనది ఏది లేదనే చెప్పాలి.పుదీనా డ్రింక్ తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ డ్రింక్ తయారుచేయడానికి కావలిసిన  పదార్ధాలు ఏంటో చూద్దామా.. !!

కావలిసిన పదార్ధాలు :

పుదీనా ఆకులు- ఒక కట్ట

కొత్తిమీర – చిన్న కట్ట

3/4 Inch అల్లం

4 యాలకలు

50 - 60 gms బెల్లం

750 ml నీళ్ళు

1 tbsp నిమ్మరసం

విధానం

ముందుగా బెల్లంలో నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. తరువాత పైన చెప్పిన  పదార్ధాలన్నీ మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ లో కొద్దిగా నీటిని పోసి వడకట్టుకోవాలి. తరువాత కరిగిన బెల్లంని కూడా వేసి ఒకసారి కలపాలి. కలిపిన పుదీనా జ్యూస్ ని ఫ్రిజ్లో ఉంచి తాగాలనుకుంటే గంట ఉంచండి. లేదంటే ఐస్ క్యూబ్స్ గాని, ఐస్ వాటర్ గాని  పోసుకుంటే వెంటనే తాగొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: