కావలిసిన పదర్ధాలు :
చికెన్ - 500 గ్రా (చిన్న ముక్కలుగా కట్)
అల్లం వెల్లుల్లి ఫస్ట్ - సరిపడా
నిమ్మకాయ - 1 (రసం తీసుకోండి)
పసుపు పొడి - 1/2 టేబుల్ స్పూన్
ఉప్పు - 1/2 స్పూన్
పచ్చిమిర్చి - 2 (పొడవాటి గీతలు)
కరివేపాకు - కొద్దిగా
మిరియాలు - 2 1/2 టేబుల్ స్పూన్లు (పొడి)
కొత్తిమీర పొడి - 2 టేబుల్ స్పూన్లు
ఆయిల్ - 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు -సరిపడా
జీలకర్ర -కొద్దిగా
తయారీ విధానం :
మొదటగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా జీలకర్ర, మిరియాలు వేసి కొంచెం సేపు వేయించాలి. అవి వేగాక వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తరువాత ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె వేసి కొద్దిగా జీలకర్ర వేసి వేపాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి గరిటెతో తిప్పి మూత పెట్టాలి. కొంచెం వేగాక చికెన్ లో కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు మూత తెరిచి, అందులో నీరు ఉంటే బాగా ఇమిరిపోయే వరకు ఉడకనివ్వండి.తరువాత ముందుగా వేయించుకున్న మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన స్పైసీ పెప్పర్ చికెన్ రెడీ అయినట్లే.. !!