నాన్ వెజ్ కర్రీలలో చేపల కూరకి వుండే ప్రాముఖ్యత మారె కర్రీ కి ఉండదు. చేపల కర్రీని చూస్తుంటేనే తినేయాలనిపించేలా ఉంటుంది. ఎప్పుడు చేసేలాగ కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. దీన్ని తయారుచేయడం తేలికే... కాకపోతే కొద్దిగా ఎక్కువ టైమ్ పడుతుంది.గ్రేవీ టైప్ కాబట్టి... ముందుగా చేప ముక్కల్ని ఫ్రై చేస్తాం అన్నమాట.  ఆ తర్వాత గ్రేవీ తయారుచేస్తాము.అయితే ఈ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం.

తయారీకి కావాల్సినవి:

చేపముక్కలు 15,
ఉప్పు కొద్దిగా,
కారం 1 టేబుల్ స్పూన్,
అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్,
నూనె 2 టేబుల్ స్పూన్లు,
గ్రేవీ కర్రీ కోసం :
నూనె 1 టేబుల్ స్పూన్,
ఉల్లిపాయలు 3 (పెద్దగా కట్ చేసుకోవాలి),
ఉప్పు కొద్దిగా,
మళ్లీ... నూనె 2 టేబుల్ స్పూన్లు,
అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్,
టమాటాలు 5 (పేస్టులా చేసి ఉంచుకోవాలి)
కరివేపాకు -కొంచెం
2 పచ్చిమిర్చి (కోసినవి),
కొత్తిమీర,
సరిపడా ఉప్పు,
కారం 1 టేబుల్ స్పూన్,
కొబ్బరి పాలు 1 కప్పు,
చింతపండు రసం 1 టేబుల్ స్పూన్,

 తయారీ విధానం:
ముందుగా చేప ముక్కలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి  రెడీ చేసుకోండి. చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వెయ్యాలి.ఇప్పుడు ఈ మసాలా మొత్తం చేపముక్కలకు బాగా అంటుకునేలా మెల్లగా కలపాలి. వాటిని అరగంటపాటూ పక్కన పెట్టాలి.ఇప్పుడు ఓ ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వెయ్యాలి. నూనె వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్ ఉంచి  చేప ముక్కలు వెయ్యాలి.చేపముక్కల్ని అటూ ఇటూ తిప్పుతూ ఫ్రై చెయ్యాలి. ఫ్రై అయిన చేప ముక్కల్ని ఓ ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టాలి.ఇప్పుడు మరో ప్యాన్‌లో నూనె 1 టేబుల్ స్పూన్ వేసి ఉల్లిపాయల ముక్కలను నూనెలో వెయ్యాలి. అవి వేగాక వెంటనే కొద్దిగా ఉప్పు వెయ్యాలి. కాసేపు ఉల్లి ముక్కల్ని వేపాలి.దాదాపు సగం వేగేవరకూ కలుపుతూ ఫ్రై చెయ్యాలి. వాటిని చల్లారబెట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చెయ్యాలి. పేస్టులా చెయ్యాలి. ఇప్పుడు ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వెయ్యాలి. నూనె వేడి అయ్యాక ఉల్లిపాయల పేస్టును అందులో వెయ్యాలి.మళ్లీ అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వెయ్యాలి. కొన్ని నిమిషాలపాటూ వేపాలి.ముందుగానే 5 టమాటాలను పేస్టులా చేసి ఉంచుకోవాలి.దాన్ని ఉల్లిపాయల పేస్టులో వేసి దానిలో వెంటనే 10 కరివేపాకులు, 2 పచ్చిమిర్చి (కోసినవి), కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, వెయ్యాలి. (పచ్చి వాసన పోయే వరకూ బాగా కలపాలి.ఇప్పుడు కొబ్బరి పాలు 1 కప్పు వెయ్యాలి. తరువాత చింతపండు రసం 1 టేబుల్ స్పూన్ వెయ్యాలి.ఉడికిన తర్వాత చేప ముక్కలను వేసేయాలి. మంట సిమ్‌లో ఉంచి... ముక్కల్ని అప్పుడప్పుడూ తిరగేస్తూ... 20 నిమిషాలు ఉడకనివ్వాలి.పైన మూత పెట్టి ఉడికిస్తూ మధ్యమధ్యలో మూత తీసి ముక్కల్ని తిరగేసి మళ్లీ మూత పెట్టేస్తూ ఉండాలి. నూనె పైకి కనబడే అంత వరకు ఉంచాలి. అంతే అదిరిపోయే గ్రేవీతో ఫిష్ కర్రీ రెడీ.కర్రీపై కాస్త కొత్తిమీర చల్లుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: