ఆవకాయ అనగానే ఉసిరికాయ, మామిడికాయ పచ్చళ్ళు గుర్తుకు వస్తాయి కానీ బంగాళదుంపతో కూడా అత్యంత రుచికరమైన ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.


కావలసిన పదార్థాలు..



1. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న 3 బంగాళాదుంపలు



2. రెండు చెంచాల ఉప్పు, రెండు గ్లాసుల నీళ్లు



3. 250 మిల్లీలీటర్ల మంచి నూనె



4. ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవపిండి



5. పావు స్పూన్ మెంతిపిండి



6. నాలుగు స్పూన్ల కారం



7. ఒక స్పూను జీలకర్ర



8. ఒక స్పూన్ ఆవాలు



9. రెండు మిరపకాయలు



10. నాలుగు వెల్లుల్లి రెబ్బలు



11. రెండు కాయల నిమ్మరసం




తయారీ విధానం:



మూడు బంగాళాదుంపలను మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా యావరేజ్ పరిమాణంలో కట్ చేసుకోవాలి. అనంతరం రెండు గ్లాసుల నీళ్ళలో రెండు చెంచాల ఉప్పు వేసి వాటిలో కోసి పెట్టుకున్న బంగాళాదుంపల ముక్కలు వేయాలి. ఈ విధంగా చేయడం వలన బంగాళాదుంపల ముక్కలు రంగు మారకుండా తెల్లగా ఉంటాయి. ఉప్పు నీటిలో వేయకపోతే ముక్కలు నల్లగా మారిపోతాయి.



ఆ తర్వాత స్టవ్ పై ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. మరీ ఎక్కువసేపు ఉడికించడం వల్ల ముక్కలు బాగా మెత్తగా తయారయ్యి రుచి కోల్పోతాయి. ఉడకపెట్టిన ముక్కలను తీసి వేరొక గిన్నెలో అరబెట్టుకోవాలి.



అనంతరం ఒక కడాయిలో 250 మిల్లీలీటర్ల నూనెను మీడియం ఫ్లెమ్ లో మరిగించాలి. ఆతర్వాత ఉండికించి ఆరబెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆపై బంగాళాదుంప ముక్కలకు తగినంత ఉప్పు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవపిండి, పావు స్పూన్ మెంతిపిండి, నాలుగు స్పూన్ల కారం బాగా దట్టించాలి. అనంతరం ముక్కలు వేయించగా మిగిలిన నూనెలో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి.






ఆపై తుంచిన రెండు మిరపకాయలు, దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి దొరగా వేయించుకోవాలి. ఈ తాలింపు పూర్తయిన తర్వాత బంగాళదుంపల ముక్కలకు జత చేసుకోవాలి. ఆపై రెండు కాయల నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బంగాళదుంప ఆవకాయ పచ్చడి రెడీ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: