బిర్యానీ ఇష్టపడని వారంటూ ఉండరు. ఇక చాలా మంది ఇంట్లోనే చికెన్, ఎగ్,వెజ్ బిర్యానీ తాయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సారి వాటితో కాకుండా వెరైటీగా పనసకాయతో బిర్యానీని ఇంట్లోనే ట్రై చేయండి.

పనసకాయ బిర్యానికి కావలసిన పదార్థాలు:

పచ్చి పనసకాయ ముక్కలు - అరకేజి, బాస్మతి బియ్యం - అరకేజి, ఉల్లిపాయలు - పెద్దవి 2, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, పుదీనా తరుగు - ఒక కప్పు, బిర్యానీ మసాలా పొడి - ఒక టేబుల్‌ స్పూను, కారం - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - ఒక కప్పు, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు - మసాల కోసం, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి తరుగు - పావుకప్పు. పెరుగు - అరకప్పు.

పనసకాయ బిర్యాని తయారుచేసే విధానం:

ఇక ముందుగా బాస్మతి బియ్యం 70 శాతం ఉడికించి నీరు వంచేసి ఆరబెట్టాలి. పనస ముక్కల్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి తగినంత నీరు పోసి 50 శాతం కుక్కర్లో ఉడికించాలి. కడాయిలో నూనె వేసి సన్నగా, పొడుగ్గా తరిగిన ఉల్లి దోరగా వేగించి వేరుగా ఉంచాలి. అదే కడాయిలో నెయ్యి వేసి మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పనస ముక్కలు, పుదీనా తరుగు, పెరుగు, బిర్యానీ మసాలా పొడి, ఉప్పు, సగం వేగిన ఉల్లి తరుగు, కారం ఒకటి తర్వాత ఒకటి వేగిస్తూ కలపాలి. 5 నిమిషాల తర్వాత ముక్కలపైన ఉడికించిన అన్నం పేర్చాలి. ఆ పైన మళ్లీ మిగిలిన ఉల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు చల్లి మూత పెట్టి చిన్నమంటపై 15 నిమిషాలు మగ్గించాలి. తర్వాత పనస ముక్కలు, అన్నం కలిపి వడ్డించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: