కోడిగుడ్డు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు గుడ్డు చూస్తే చాలు లొట్టలు వేసుకుని మరి తింటారు. అయితే ఎప్పుడు వండేలాగా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేసి చూద్దామా. లేత బీరకాయలో కోడిగుడ్డు పోరుటితే వచ్చే రుచే వేరు సుమా.మరి ఆలస్యం చేయకుండా బీరకాయ కోడిగుడ్డు పొరుటు కూర ఎలా చేయాలో చూద్దామా. !

 కావాల్సిన పదార్ధాలు:

400 gms చెక్కు తీసిన లేత బీరకాయ ముక్కలు

4 గుడ్లు

2 ఉల్లిపాయ

2 చీలికలు పచ్చిమిర్చి

1 tsp అల్లం తరుగు

1 tsp జీలకర్ర

2 ఎండుమిర్చి

1 రెబ్బ కరివేపాకు

2 tsp కొత్తిమీర

1/4 tsp పసుపు

1 tsp కారం

ఉప్పు

1 tsp ధనియాల పొడి

గరం మసాలా- చిటికెడు

1/4 cup నూనె

తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, అల్లం వేసి వేపుకోండి.అవన్నీ వేగాక ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి పచ్చి వాసన పోయే దాక వేపి బీరకాయ ముక్కలు వేసి ఇందులోనే కారం, పసుపు, ఉప్పు బాగా కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలేదాకా మీడియం-ఫ్లేం మీద మగ్గించుకోండి. నూనె పైకి తేలగానే గుడ్లు కూర మీద కొట్టి కదపకుండా మూత పెట్టి సన్నని మంట మీద కూరని 3-4 నిమిషాలు మగ్గనివ్వండి.అసలు కదపకూడదు.లేదంటే గుడ్డు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. ఒక ఐదు నిమిషాల తరువాత ఒక గరిటతో గుడ్లను కట్ చేసి బాగా కలిపి కూర లోంచి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేయాలి, ఈ కూర వేగి నూనె పైకి తేలడానికి పన్నెండు పదిహేను నిమిషాలు పడుతుంది.నూనె పైకి తేలగానే కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.
ఇది అన్నం, చపాతీ, పూరీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: