గుడ్డు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. పిల్లలు,పెద్దలు అందరు కూడా గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు. అయితే గుడ్డు కూరని ఎప్పుడు వండేలాగా కాకుండా కాస్త మసాలా దట్టించి పులుసు కూరలాగా వండితే తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. గుడ్డు పులుసులో వేసే నువ్వులు, వేరుసెనగపప్పు, కొబ్బరి కూరకి  కమ్మని చిక్కని గ్రేవీ ఇస్తుంది. నువ్వులు, పల్లీలు, కొబ్బరిని సన్నని సెగ మీద వేపాలి అప్పుడే గ్రేవీ రుచిగా ఉంటుంది.అలాగే గ్రేవీ రుచి పెరగాలంటే ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి అప్పుడే రుచి.మరి గుడ్డు పులుసుకు కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దామా.. !

పులుసు కోసం :

5 ఉడికించిన గుడ్లు
1/3 cup నూనె (80 ml)
1/2 liter నీళ్ళు
2 tbsps కొత్తిమీర తరుగు

గ్రేవీ కోసం :

1/4 cup వేరుసెనగపప్పు
1/4 cup నువ్వులు
1/4 cup ఎండు కొబ్బరి పొడి
2 tbsp ధనియాలు
1 tsp జీలకర్ర
1/4 tsp మెంతులు
2 పెద్దవి ఉల్లిపాయ తరుగు (150 gms)
1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
1/4 tsp పసుపు
1 tbsp కారం
ఉప్పు
200 ml చింతపండు పులుసు
1/2 liter నీళ్ళు

తయారీ విధానం :

మూకుడులో వేరుసేనగపప్పు , మెంతులు వేసి ఎర్రగా లో- ఫ్లేం మీదే వేపుకోవాలి.ఇప్పుడు అందులోనే వేరు శెనగపప్పు బాగా వేగాక ధనియాలు, జీలకర్ర, వేసి ఓ నిమిషం వేపుకోవాలి, ఆ తరువాత నువ్వులు వేసి చిటచిటలాడించాలి. ఆఖరున కొబ్బరి పొడి వేసి 30 సెకన్లు వేపి మెత్తని పొడి చేసుకోవాలిఅదే మూకుడులో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. (ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే గ్రేవీ కి చిక్కని రుచి) వేగిన ఉల్లిపాయల్ని మెత్తగా చేసుకున్నపొడి లో వేసుకోవాలి.అదే మిక్సీ జార్లో పొడితో పాటు అల్లం వెల్లూలి ముద్దా, కారం, ఉప్పు, చింతపండు పులుసు, పసుపు అన్నీ వేసి మెత్తని వెన్నలాంటి పేస్టు చేసుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకున్న నూనెలో గుడ్లకి గాట్లు పెట్టి గరిట బోర్లించి తిప్పుతూ హై ఫ్లేం మీద ఎర్రగా వేపి తీసుకోవాలి.గుడ్లు వేగాక పక్కకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.నూనె పైకి తేలాక 1/2 లీటర్ నీళ్ళు పోసి హై- ఫ్లేం మీద మూత పెట్టి బాగా ఉడుకురానివ్వాలి.కర్రీ దగ్గర పద్దాక ఉప్పు చూసుకుని దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లుకోవడమే. ఈ కూర అన్నంలో తిన్నా చపాతీలో తిన్నాగాని ఎంతో రుచికరంగా ఉంటుంది.. !!






మరింత సమాచారం తెలుసుకోండి: