ఈరోజు స్పెషల్ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ.ఈ కర్రీ తినడానికి ఎంతో రుచికరముగా ఉంటుంది. ఇందులో టొమోటో, జీడిపప్పు పేస్ట్ వేయడం వలన కూరకి మంచి రుచి వస్తుంది. చిక్కని టొమాటో జీడిపప్పు గ్రేవీతో తినడానికి క్రీమీగా ఉంటుంది.పనీర్ బటర్ మసాలా గ్రేవీ అంటేనే  టొమాటో జీడిపప్పుని గ్రైండ్ చేసి చేసేదే.ఈ కర్రీ కోసం టొమాటోలు బాగా పండినవి ఇంకా పులుపు తక్కువగా ఉండే టొమాటోలు వాడుకుంటే గ్రేవీ కమ్మగా వస్తుంది.అలాగే మనం వాడే పనీర్ మృదువుగా తాజాగా ఉన్నది వాడాలి. బజార్ నుండి తెచ్చిన పనీర్ అయితే గ్రేవీలో వేసే ముందు 10 నిమిషాలు నీళ్ళలో నానబెడితే సాఫ్ట్ అవుతుంది. ఇంకా ఇంట్లో చేసుకునే పనీర్ ఎప్పుడూ గొప్ప రుచినిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా వండాలో చూద్దామా.. !

కావాల్సిన పదార్ధాలు

200 gms పనీర్

5 టమాటో

1 ఉల్లిపాయ

1/4 cup జీడిపప్పు

1 ఇంచ్దా ల్చిన చెక్క

2 యాలకలు

2 లవంగాలు

1/2 ఇంచ్ అల్లం

4 వెల్లూలి

1/2 tsp నలిపిన కసూరి మేథి

3/4 tsp ధనియాల పొడి

3/4 tsp వేయించిన జీలకర్ర పొడి

1 tsp పంచదార

4 tbsps బటర్

ఉప్పు

2 tsps  కారం

1 tbsp నూనె

1/2 cup ఫ్రెష్ క్రీం(పాల మీగడ)

2 tsps కొత్తిమీర

300 ml నీళ్ళు గ్రేవీ కోసం

1/2 ltr టొమాటోలు ఉడికించడానికి

ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్లో టమాటో ముక్కలు, ఉల్లిపాయ, చెక్క, లవంగాలు, యాలకలు, జీడిపప్పు ½ లీటర్ నీళ్ళు పోసి అన్నిటిని మెత్తగా ఉడికించుకోవాలి.అవి మెత్తగా ఉడికాక నీళ్ళతో సహా ఒక మిక్సీ జార్ లో వేసి చక్కగా మెత్తని గ్రేవీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ లో బటర్ కరిగించి అందులో, కాస్త నూనె, కారం వేసి కాసేపు వేపి అందులో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు టమాటో పేస్టు వేసి బాగా కలుపుతూ చిక్కబడనివ్వండి.గ్రేవీ చిక్కబడ్డాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలిపి 300 ml నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి.ఇప్పుడు గ్రేవీ కాస్త చిక్కబడ్డాక పనీర్ ముక్కలు వేసుకుని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరకు కర్రీ పైన ఫ్రెష్ క్రీం(పాల మీగడ) వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయండి. ఒక నిమిషం అయ్యాక  కాస్త కొత్తిమీర తరుగు చల్లుకోండి అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయినట్లే.. !





మరింత సమాచారం తెలుసుకోండి: