కోడి గుడ్డు ను తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. గుడ్డు లో చిన్న పిల్లల ఎదుగుదలకు కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ముఖ్యంగా కాల్షియం, ఐరన్ లతో పాటుగా మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. అందుకే ప్రతి రోజూ డాక్టర్లు ఒక గుడ్డును తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. అయితే గుడ్డును అలానే ఉడక పెట్టీ తీసుకోవడం కన్నా రక రకాల వెరైటీలను చేసుకొని తింటున్నారు. కర్రీ , స్నాక్స్, రైస్ ఐటమ్స్ ఇలా ఒకటేమిటి చాలా రకాలు తయారు చేస్తున్నారు. ఒక్కో ప్రాంతం లో ఒక్కో రకమైన వంట ను చేస్తారు. అయితే ఈ మధ్య కాలం లో ఎగ్ తడ్కా అనేది ఫేమస్ అయ్యింది. ఈ పేరు ప్రతి ఒక్క రెస్టారెంట్ లో వినిపిస్తుంది.. అయితే ఆ కర్రీని ఎలా చేసుకోవాలో, ఎటువంటి పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..


కావలసిన పదార్థాలు:

గుడ్లు: 2,

కరివేపాకు: రెండు రెబ్బలు,

పచ్చిమిర్చి: రెండు,

ఉప్పు: తగినంత,

ఇంగువ: చిటికెడు,

నూనె: సరిపడినంత,

చిల్లీసాస్‌: ఒక టీ స్పూన్

తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి, ప్యాన్ పెట్టీ నూనె వేయాలి..  నూనె వేడయ్యాక కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. బాగా వేగిన పచ్చిమిర్చి ముక్కలపై చిటికెడు ఇంగువ వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికాస్త నూనె వేసి, వేడయ్యాక గుడ్లు కొట్టి వేయించాలి. బాగా వేగాక తగినంత ఉప్పు వేసి కలిపి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి వేయించిన పచ్చిమిర్చి ముక్కలు వేసి చిల్లీసాస్‌ కలిపితే సరి. ఎగ్‌ తడ్కా రెడీ.. ఇలా చేసుకొని తినడం వల్ల  చాలా రుచిగా ఉంటుంది.. అంతేగా కొత్తగా ఉండటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈ వెరైటీ వంట మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: