కావాల్సిన పదార్ధాలు:
3 టొమాటో
1 ఉల్లిపాయ
15 - 20 జీడిపప్పు
3 మిరపకాయలు
1/2 inch దాల్చిన చెక్క
2 యాలకలు
2 లవంగాలు
ఉప్పు
300 ml నీళ్ళు
కర్రీ కోసం :
2 tbsp నూనె
3 దంచిన యాలకలు
1/3 cup బంగాళాదుంప ముక్కలు
1/3 cup కేరట్ ముక్కలు
3 బేబీ కార్న్ (Inch pieces)
6 ఫ్రెంచ్ బీన్స్ (1 inch pieces)
కాలిఫ్లవర్ కొంచెం
1/3 cup పనీర్ ముక్కలు
1/3 cup బటానీ
1 tsp అల్లం వెల్లులి ముద్ద
ఉప్పు
పసుపు – చిటికెడు
1/2 tsp ధనియాల పొడి
1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
1/2 tsp గరం మసాలా
3 tbsp బటర్
3 tbsp ఫ్రెష్ క్రీమ్
1 tsp నెయ్యి
తయారీ విధానం:
ఒక గిన్నెలో గ్రేవీ కోసం ఉంచిన టమోటో, జీడిపప్పు,, ఉల్లిపాయలు, మిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు ఉప్పు కూడా వేసి మూత పెట్టి టొమాటో జీడిపప్పు మెత్తబడే దాకా ఉడికించుకోవాలి తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.మరొక పాన్లో నూనె వేడి చేసి దంచిన యాలకలు, దుంప ముక్కలు, కేరట్ , బేబీ కార్న్, బీన్స్, కాలీఫ్లవర్ ఉప్పు వేసి 2 నిమిషాలు వేపుకోవాలితరువాత బటర్ వేసి కూరలు లేత బంగారు రంగు వచ్చేదాకా మూతపెట్టి వేపుకుంటే చాలుబంగారు రంగు వచ్చాక అల్లం వెల్లులి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, నలిపి వేసుకోవాలిటొమాటో పేస్ట్ పోసి బాగా కలిపి మూత పెట్టి నెయ్యి పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 5 నిమిషాల తరువాత బటానీ వేసి కలిపి వదిలేస్తే మెడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలకి నెయ్యి పైకి తేలుతుందిఆఖరుగా పనీర్ ముక్కలు, క్రీమ్, నెయ్యి వేసి ఒక నిమిషం ఉడికించి దింపేసుకోవాలి. ఈ కర్రీ ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. !