ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఏమి కూర వండాలని ఆలోచిస్తున్నారా. అయితే ఇండియా హెరాల్డ్ వారు చెప్పే పచ్చి పులుసు రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది.మరి పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు
చింత పండు కొద్దిగా
ఉల్లిపాయ 1
పచ్చి మిర్చి 2
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తి మీర కొద్దిగా
ఉప్పు తగినంత
చక్కెర 1/2 టీస్పూన్
నూనె 3 టీ స్పూన్లు
ఆవాలు కొద్దిగా
జీలకర్ర 1/4 టీ స్పూన్
ఎండు మిర్చి 2
మిరప గింజలు 1/2 టీ స్పూన్
బెల్లం కొద్దిగా
తయారు చేయు విధానం :
ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా చింత పండు తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసి కొంచెం సేపు నానపెట్టాలి. చింత పండు నానిన తరువాత కాస్త పలుచగా పులుసు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో ఎండు మిరపకాయలు వేసి వేపాలి.వాటిలో ఉప్పు వేసి కొంచెం కచ్చా పచ్చాగా నూరుకోవాలి. ఇప్పుడు ఎండు మిరప కాయలు పొడి, సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి బాగా పిసికి చింత పండు పులుసులో కలపాలి.ఇందులో బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గిన్నెలో నూనె వేడి చేసి ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, మిరప గింజలు వేసి తాలింపు కాగిన తర్వాత పులుసులో పోసి మూత పెట్టి దింపేయాలి.ఇందులో కాస్త జీల కర్ర పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు.బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. మన అమ్మమ్మల కాలం నాడు ఈ పచ్చి పులుసుని బాగా వండేవారు. మరి మీరు కూడా మేము చెప్పిన విధంగా ఒకసారి పచ్చి పులుసు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది.