చికెన్ అంటే ఇష్టం లేనివారు అంటూ ఎవరు ఉండరు. ప్రతిసారి రొటీన్ గా చికెన్ కర్రీ కాకుండా ఈసారి కొత్తగా చికెన్ లో మామిడి కాయ వేసి వండి చూడండి. చాలా బాగుంటుంది. ఎలా వండాలి అని అనుకుంటున్నారా.. మీ కోసం ఇండియా హెరాల్డ్ వారు చికెన్ అండ్ మాంగో కర్రీ ఎలా తయారు చేయాలో వివరించబోతున్నారు. మరి మీరు కూడా ఒకసారి చూసి ఇంట్లో ట్రై చేసి చూడండి. !

కావాల్సిన పదార్ధాలు:

500 గ్రాములు బోన్ లెస్ చికెన్

1 మామిడి పండు( తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి )

1 కప్ కొబ్బరి తురుము

2 - 4 వెల్లుల్లి రెబ్బలు

ఒక చిన్న ముక్క అల్లం

2 పచ్చిమిర్చి

2 టేబుల్ స్పూన్స్ కారం

1 టేబుల్ స్పూన్ సోపు సీడ్

1 టేబుల్ స్పూన్ పసుపు

2 ఎండుమిర్చి

1 టేబుల్ స్పూన్ ఆవాలు

4 ఏలకలు

చిన్న ముక్క దాల్చిన చెక్క

3 టేబుల్ స్పూన్స్ నూనె

1 బిర్యాని ఆకు

రుచికి సరిపడేంత ఉప్పు

తయారు చేయు విధానం

ముందుగా ఎముకలు లేని చికెన్ ని తీసుకుని నీటితో శుభ్రం చేసుకుని, వాటిని ఒక పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చికెన్ కు బాగా పట్టించాలి. అలా మ్యారినేట్ చేసిన తరువాత ఒక రాత్రంతా చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టేయాలి.మరుసటి రోజు ఒక పెనుమును స్టౌ మీద వుంచి అందులో కొబ్బరి తురుము, ఉల్లిపాయ పేస్ట్ ను వేసి కొద్దిసేపు వేపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేడి చేసుకుని, తరువాత స్టౌ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇంకొక బాండీలో  డీప్ బాటమ్ వరకు  నూనె వేసి, స్టౌ మీద వుంచి వేడిచేసుకోవాలి. అలా కాగిన తరువాత అందులో బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, ఆవాలు, సోంపు వేసి కొద్దిసేపు వరకు మంటమీద వేడి చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న పోపు మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను అందులో వేయాలి. తరువాత 5 నుంచి 10 నిముషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కర్రీ నుంచి నూనె సెపరేట్ అవుతుంది. ఆ నూనెలో మొదటిగా  ఫ్రై  చేసుకున్న కొబ్బరి, ఉల్లిపాయల పేస్ట్ ను వేయాలి. అలగే వీటితోపాటు మసాలాలు కూడా వేయాలి . ఈ విధంగా ఈ మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేస్తూ తిప్పుతూ ఉండాలి. తరువాత  ముందుగా ముక్కలు చేసిపెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే రెండు లేదా మూడు కప్పుల నీళ్లు,రుచికి సరిపడేంత ఉప్పు,కారం  వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: