ఓట్స్పొడి: కప్పు
నూనె: మూడు చెంచాలు
ఆవాలు: చెంచా
మినప్పప్పు: అరచెంచా
సెనగపప్పు: చెంచా
జీలకర్ర: అరచెంచా
కరివేపాకు రెబ్బలు: రెండు
అల్లం ముద్ద: అరచెంచా
పచ్చిమిర్చి: రెండు క్యారెట్ ఒకటి(తురమాలి)
పసుపు: పావుచెంచా
రవ్వ: అరకప్పు
పెరుగు: అరకప్పు
నీళ్లు: కప్పు
కొత్తిమీర తరుగు: రెండు టేబుల్స్పూన్లు
ఉప్పు: తగినంత,
జీడిపప్పు పలుకులు: కొన్ని,
ఉప్పు - తగినంత
తయారీ విధానం :
ముందుగా స్టౌ వెలిగించి పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో మూడు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆ నూనెలో జీడిపప్పు వేసి వేపుకోండి. అవి వేగిన తరువాత ఒకగిన్నెలొకి తీసుకుని అదే నూనెలో ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం ముద్ద, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తురుము, పసుపు వేసి వేయించాలి. అవి అన్నీ వేగిన తరువాత అందులో రవ్వ కూడా వేసి ఎర్రగా వేయించాలి. తరువాత ఓట్స్ పొడి వేసి ఓక సారి వేయించి పొయ్యి ఆఫ్ చేయండి.ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిన తరువాత అందులో కొద్దిగా పెరుగు, అర కప్పు నీళ్లు, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు అందులోనే మరో అరకప్పు నీళ్లు పోసి కలిపి మూత పెట్టేయాలి. ఈ పిండిని ఒక అరగంట పాటు నానపెట్టి ఉప్ప వేసి మరోసారి కలపి ఇడ్లి ప్లేట్స్ లో ఇడ్లీల్లా వేసుకుని స్టవ్ మీద ఒక పావు గంట సేపు పాటు ఆవిరిమీద ఉడికించుకుని తీసుకోవాలి.అంతే ఓట్స్ ఇడ్లీ లు రెడీ అయినట్లే.