సాయంత్రం పూట ఎంచక్కా తోట కూరతో ఇలా గారెలు వేసుకుని చూడండి చాలా బాగుంటాయి. అలాగే తోట కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గారెలు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు మీ కోసం ఇండియా హెరాల్డ్ వారు తోటకూరతో ఒక మంచి స్నాక్ ఐటమ్ నీ మీ ముందుకు తీసుకుని వచ్చారు. ఈ గారెలు పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కావలిసిన పదర్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా. !

 కావాల్సిన పదార్ధాలు:

1 cup పచ్చి శెనగ పప్పు

1/2 cup మినప పప్పు

2 పచ్చి మిర్చి

2 వెల్లులి రెబ్బలు

1 tsp అల్లం తరుగు

ఉప్పు

1 cup తోట కూర తరుగు

1 tsp జీలకర్ర

నూనె వేపుకోడానికి - సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో శెనగ పప్పు, మినపప్పుని  కడిగి వాటిలో నీళ్ళు పోసి ఒక నాలుగు గంటల పాటు  నాన బెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని నీళ్లు అన్నీ వడకట్టి మిక్సీలో వేసి, కొద్దిగా అల్లం, వెల్లుల్లి ముక్క కూడా వేసి  బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గట్టిగా రుబ్బుకొండి.ఇప్పుడు తోటకూరను చిన్న చిన్న ముక్కలుగా కోసి శుభ్రంగా నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకున్న గట్టి శెనగపప్పు ముద్దలో మిగిలిన పదార్ధాలు అయిన ఉప్పు, జీలకర్ర, పచ్చి మిర్చి, అల్లం తరుగుతో పాటు తోటకూరని కూడా గట్టిగా నీళ్లన్నీ పిండి వేయాలి. కలుపుకున్న పిండి ముద్దని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద చిన్న పలుచగా వత్తుకుని మధ్యలో గారే మాదిరిగా రంధ్రం చేసి పొయ్యి మీద కాగుతున్న వేడి వేడి నూనెలో వేసి రెండు వైపులా వేపుకోవాలి.స్టవ్ మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని గారెలు వేపుకోవాలి.లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: