బంగాళాదుంప అండ్ స్వీట్ కార్న్ తో ఒక రుచికరమైన రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాము. మరి ఆలస్యం చేయకుండా కావలిసిన పదర్ధాలు ఏంటో చూద్దామా.!
కావలసిన పదార్దాలు :

స్వీట్ కార్న్ – 1 కప్

బంగాళాదుంపలు – ½ kg

ఉల్లిపాయలు – 1 పెద్దది

పచ్చిమిర్చి – 2

కరివేపాకు – 2 రెమ్మలు

కొత్తిమీర తురుము– 2 స్పూన్స్

అల్లం వెల్లుల్లి పేస్టు – 1 స్పూన్

జీలకర్ర పొడి– ½ స్పూన్

గరం మసాలా పొడి– 1 స్పూన్

ఉప్పు– రుచికి తగినంత

పసుపు – ¼ స్పూన్

కారం– 2 స్పూన్స్

ఆయిల్– 3 టేబుల్ స్పూన్స్

తాలింపు గింజలు– 1 స్పూన్

ఎండుమిర్చి– 2.

తయారీ విధానం :

ముందుగా స్వీట్ కార్న్ యొక్క గింజలను వొలిచి ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించు కోవాలి. అలాగే బంగాళా దుంపలు కూడా నీళ్లు పోసి కుక్కర్ లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కొద్దిసేపు అయ్యాక కుక్కర్ మూత తీసి బంగాళాదుంపల్ని చల్లటి నీటిలో వేయండి. ఇప్పుడు బంగాళదుంప మీద ఉన్న తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.


ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి వేయించండి తాలింపు వేగిన తరువాత, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.అన్ని వేగిన తరువాత పసుపు వేసి కలిపి స్వీట్ కార్న్ కూడా వేయండి. ఒక ఐదు నిమిషాల పాటు వేగిన తరువాత  కట్ చేసి పెట్టుకున్న బంగాళా దుంపలు వేసి, మీడియం ఫ్లేమ్ ఉంచి ఐదు నిముషాలు, కలుపుతూ వేయించాలి.ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా,కారం కూడా వేసి వేయించాలి.చివరగా కొత్తిమీర తురుము వేసి పొయ్యి ఆఫ్ చేయండి. !

.

మరింత సమాచారం తెలుసుకోండి: