కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ – 3 కప్పులు
మినప్పప్పు – 1 కప్పు
మెంతులు – 1 టేబుల్ స్పూన్
అటుకులు – గుప్పెడు
ఉప్పు -సరిపడా
తయారీ విధానం :
పైన చెప్పిన పదార్ధాలు అన్నిటిని ఒక ఐదు గంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత నానపెట్టుకున్న మినప్పప్పు,మెంతులు,అటుకులు రుబ్బుకుని,జొన్నరవ్వ కూడా వేసి మెత్తగా మిక్సీలో వేయండి. ఆ తరువాత రుబ్బిన పిండిని గిన్నెలో తీసుకుని ఒక రెండు గంటల పాటు బయట ఉంచి తరువాత ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు ఇడ్లిలు వేసుకుంటే మెత్తగా బాగుంటాయి. మరీ ఇడ్లీలను మీరు కూడా ఒక సరి ట్రై చేసి చూడండి
2)బార్లీరొట్టె:
జొన్నరొట్టెల్లాగా బార్లీ పిండితో కూడా రొట్టెలు చేస్తారన్న విషయం మీకు తెలుసా. బార్లీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఈ బార్లీ రొట్టె చాలా మంచిది.
కావలసిన పదార్థాలు:
బార్లీ పిండి – 3 కప్పులు
నీళ్ళు – సరిపడా
ఉప్పు – తగినంత
తయారీ విధానం :
ఒక గిన్నెలోకి బార్లీ పిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు కలిపి ఉంచుకోవాలి.అలాగే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని బాగా వేడి చేయండి. ఇప్పుడు ఆ వేడి నీటిని బార్లీ పిండిలో పోసి చపాతీ పిండి లాగా గట్టిగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోని పొడి పిండితో చపాతీలాగా కర్రతో ఒత్తుకోవాలి.ఆ తరువాత పొయ్యి మీద పెనం పెట్టి వేడి ఎక్కిన తరువాత కొద్దిగా నూనె పోసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మీరు కూడా ఒక సారి ట్రై చేసి చూడండి