కావలిసిన పదర్ధాలు :
పచ్చి రొయ్యలు – ½ kg
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 3
టమాటో -1
పసుపు – ¼ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – 5 రెమ్మలు
ఆయిల్ – 4 టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి – ½ స్పూన్
ధనియాల పొడి – 2 స్పూన్స్
గరం మసాలా పొడి – 1 స్పూన్
ఎండు కొబ్బరి పొడి – 4 టేబుల్ స్పూన్స్
సాల్ట్ – రుచికి తగినంత
కారం – 2 స్పూన్స్
తయారీవిధానం :
ముందుగా రొయ్యలను శుబ్రం చేసి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి 5 నిముషాలు మూత పెట్టి మగ్గ నివ్వాలి. ఇలా చేయటం వలన రొయ్యల నుండి వచ్చే నీచు వాసన పోతుంది. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సి జార్ లో వేసి మెత్తని పొడిగా చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ కి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి వేగనివ్వాలి.ఇవి వేగిన తరువాత ఇందులో ఉడికించిన రొయ్యలు కూడా వేసి బాగా కలపాలి. రెండు మూడు నిముషాల తరువాత పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసి కలుపుతూ ఉండాలి.ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచి 10 నిముషాల పాటు మగ్గనివాలి.అ తరువాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఎండుకొబ్బరి పొడి, కారం కూడా వేసి కలుపుతూ ఉండాలి.నీరు పోయవలిసిన పని లేదు.పైకి నూనె కనిపించే అంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.