గోంగూర పులిహోర కు కావలసిన పదార్థాలు:
అన్నం : 1/4 గ్లాస్
గోంగూర కట్టలు : 4
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
పచ్చిమిరపకాయలు : 8
హింగువ : తగినంత
నూనె : సరిపడా
ఎండు మిరపకాయలు : 4
ఆవాలు :1టీ స్పూన్
చెనగపప్పు : 3 టేబుల్ స్పూన్లు
పల్లీలు: 3 టేబుల్ స్పూన్లు
గోంగూర పులిహోర తయారు చేసే విధానం:
1/4 గ్లాస్ అన్నం ను పొడి పొడిగా వండుకోవాలి. ఆ అన్నంను చల్లారనీయాలి.
4 గోంగూర కట్టలు తీసుకొని ఆకులు తెంపుకొని దానిని నీటిలో కడుగుకోవాలి. 8 పచ్చిమిరపకాయల ని తీసుకొని వాటిని ఒక దాంట్లో రెండు విరుచుకోవాలి.ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని దానిలో పులిహోరకు సరిపడా నూనె పోసుకోవాలి. కాగిన నూనెలో 1టీ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్లు చేనగపప్పు, 3 టేబుల్ స్పూన్లు పలీలు,చిటికెడు పసుపు,తగినంత ఇంగువ, 4 ఎండు మిరపకాయలు,విరిచి పెట్టుకున్న 8 పచ్చి మిరపకాయలు వేసి పోపు పెట్టుకోవాలి.ఒక రెండు నుంచి మూడు నిమిషాల తరువాత పోపులో నుంచి ఎండు మిరపకాయలు మరియు పచ్చిమిరపకాయలు తీసి చల్లార్చిన అన్నం పైన వేయాలి.
మిరపకాయలు తిసిన తర్వాత పోపు లో గోంగూర వేసి మగ్గనివ్వాలి దీనిలో సరిపడా ఉప్పు , ఇంగువ వేయాలి. గోంగూర మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చిన అన్నంలో వేసి పులిహోర కలుపుకోవాలి.ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర రెడీ టు ఈట్.