ఉలవచారు.. ఆవకాయ.. బహుశా తినని వారంటూ ఎవరూ ఉండరేమో.. అయితే ఈ కమ్మటి.. గుమగుమలాడే నోరూరించే ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు..

కావలసిన పదార్థాలు:
1).1 కప్పు ఉలవలు
2).1 కప్పు నీళ్ళు
3).1/2 కప్పు తురిమిన కొబ్బరి
4). ఉల్లిపాయ ఒకటి
5). అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
6). కొద్దిగా అసఫోయ్టెడా ( ఇంగువ)
7). 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర
8).1 1/2 టీ స్పూన్ రసం పొడి
9). రుచికి సరిపడా  ఉప్పు
10).1 టేబుల్ స్పూన్ బెల్లం
11).2 టేబుల్ స్పూన్ల చింత పండు రసం
12). వాసనకు , రుచికి సరిపడా కొద్దిగా  కొత్తిమీర.. తరిగి పెట్టుకోవాలి..


తయారీ విధానం:
ఒక కప్పు ఉలవలు.. ఒక కప్పు నీరు పోసి ప్రెజర్ కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

ఇప్పుడు ఒక గ్రైండర్ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఉలవల ముద్ద వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి.. అందులో కొద్దిగా నూనె వేసి , ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేయాలి.

ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవ పేస్టును కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేలా మిక్స్ చేయాలి.

నీరు ఉడుకుతున్న సమయంలో రసం పౌడర్ వేసి.. చింతపండు గుజ్జు ను కూడా బాగా కలపాలి.

ఇక చివర్లో బెల్లం, ఉప్పు కలిపి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. రసం బాగా దగ్గరకు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర ఆకులను కలుపుకుంటే రసం టేస్ట్ సూపర్ గా మారిపోతుంది..

ఇక దీనిని వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటే రుచిగా ఉండటం తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.ముఖ్యంగా ఈ ఉలవచారు ను మటన్ కర్రీ తో కలిపి తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రుచిని ఆస్వాదించే వారికి తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: