చాలా మంది భోజనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు . కొంత మంది రోజుకు మూడు పూటలా భోజనం తీసుకున్న కూడా కచ్చితం గా అందులో ఆకు కూరలు , విటమిన్స్ , పప్పు ధాన్యాలు ఉండే లా జాగ్రత్త పడుతూ ఉంటారు . అలా ఉండడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఏవి తమ దగ్గరకు రావు అని వారు భావిస్తూ ఉంటారు . ఇక పోతే మనం రోజు తీసుకునే భోజనం లో ఆకు కూరలు , పిండి పదార్థాలు , విటమిన్స్ ఉండడం మాత్ర మే కాదు మనం భోజనం తీసుకునే సమయం కూడా ముఖ్యమే అని పరిశోధకులు చెబుతున్నారు .

మనం భోజనం తీసుకునే సమయం సరిగ్గా లేనట్లు అయితే ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నా కూడా ఆ భోజనం వ్యర్థం అని చాలామంది పరిశోధకులు చెబుతున్నారు. ఇకపోతే చాలా మంది రాత్రి భోజనాన్ని చాలా ఆలస్యంగా చేస్తూ ఉంటారు.  ఇలా చేయడం వల్ల వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నిద్ర పోవడానికి మూడు గంటల లోపు భోజనం చేసేవారిలో వారానికి కనీసం నాలుగు రోజుల పాటు పెద్ద పేగు చివర (కోలోరెక్టల్) క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు తాజాగా బయటపడింది.

రాత్రి భోజనాన్ని చాలా తొందరగా తినే వారితో పోలిస్తే ఆలస్యంగా తినే వారికి కనితి (అడోనోమా) ఏర్పడే అవకాశం కూడా 46% ఎక్కువగా ఉన్నట్లు శికాగో లోని రష్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు కూడా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేసే వారికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేసే వారికి అనేక ఆరోగ్య సమస్యలు జీవితంలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: