భారతీయులకు , అమెరికన్లకు మధ్య ఆహారపు అలవాట్లలో అనేక వ్యత్యాసాలు ఉంటాయి. ఇక ఎంతో మంది భారతీయులు అమెరికాకి వెళ్ళినప్పుడు వారి ఆహారపు అలవాట్లను , వారి పద్ధతులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అమెరికన్స్ , ఇండియాకు వచ్చిన సమయాలలో వారు కూడా మన ఆహారపు అలవాట్లను సాంప్రదాయాలను పద్ధతులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా అమెరికా పౌరురాలు క్రిస్టెన్ ఫిషర్ 2017 వ సంవత్సరంలో భారత్ కి వచ్చి న్యూఢిల్లీ లో నివసిస్తున్నప్పుడు తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి ఓ వీడియోను చిత్రీకరించి దానిని విడుదల చేసింది.

ఆ వీడియోలో ముందుగా ఆమె వంటకాల గురించి మొదలు పెట్టింది. అందులో భాగంగా యూఎస్ ప్రజలు తమ వంటకాలలో ఎక్కువ ఉప్పు , మిరియాలను , మసాలాను ఉపయోగిస్తే భారతీయులు మాత్రం ఎండు మిర్చి కారం , ధనియాల పొడి  , పసుపు , గరం మసాలా , జీరా పొడి , నల్ల మిరియాలు వంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు అని ఆమె చెప్పింది. అలాగే భోజనం చేసే సమయాల విషయంలో కూడా భారతీయులకు , అమెరికన్స్ కి మధ్య చాలా తేడా ఉంటున్నట్లు ఈమె చెప్పింది. యు ఎస్ ప్రజలు సాయంత్రం ఐదు గంటలకు డిన్నర్ టైంలో స్టార్ట్ చేస్తారు. అదే భారత్ లో అది రాత్రి పది గంటల సమయంలో మొదలవుతుంది అని ఆమె చెప్పుకొచ్చింది.

అలాగే టీ , కాఫీలు తాగే విషయంలో కూడా భారతీయులకు ,  అమెరికన్లకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది అని ఈమె చెప్పింది. భారతీయులు చిన్న కప్పులలో కాఫీ లేదా టీ ని తాగితే  , అమెరికన్స్ మాత్రం పెద్ద పెద్ద కప్పు లలో కాఫీ తాగుతుంటారు అని ఏమో చెప్పింది. అలా ఆహారపు అలవాట్ల విషయంలో భారతీయులకు ,  అమెరికన్ లకి ఉన్న వ్యత్యాసాలను ఈ వీడియో ద్వారా అమెరికా పౌరురాలు క్రిస్టెన్ ఫిషర్ వీడియో ద్వారా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: