ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతూ ఉంటే... మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. సామూహిక అత్యాచారాలు, మద్యానికి బానిసై భార్యను అంతం చేసే... ఇలాంటి సంఘటనలు రోజురోజుకీ అనేక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పరిస్థితి ఎలా ఉన్నా కూడా... మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు అనే చెప్పాలి. మహిళల కోసం ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా కూడా.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.
ఇటీవల ఒక వివాహితపై సామూహిక అత్యాచారం పాల్పడిన కొందరు కామాంధులు ... ఆ ఘటనని మొత్తం వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారని. తెలిసింది ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.... ఉత్తరప్రదేశ్ లోని సంత్ రవిదాస్ నగర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఒక వివాహిత కట్టెలు కొట్టుకోవడం కోసం ఈనెల పదవ తేదీన గ్రామ శివారులో కి వెళ్ళింది. ఆమె ఆ వైపు వెళ్తుండగా గమనించి అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్గొనడం జరిగింది.
అంతేకాకుండా ఈ దారుణాన్ని వారి సెల్ ఫోన్ లో వీడియో తీయడం జరిగింది. అలాగే ఎవరికైనా ఈ విషయం చెబితే నీ భర్తను చంపేస్తాము అంటూ వారు బెదిరించడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఆ నలుగురు ఆ వీడియోని అడ్డం పెట్టుకుని ఆ యువతిని బెదిరింపులకు గురి చేసారు. ఇక ఆ బాధితురాలు వారి బెదిరింపులకు కొన్ని రోజులు సహించిన ఆమె చివరకు సహనం కోల్పోయి జరిగిన విషయాన్ని భర్తకు తెలియజేసింది. దీనితో అతను ఆమెను వెంటపెట్టుకుని గోపీగంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఘటనపై పోలీసులు అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంకా ఈ విషయం తెలుసుకున్న ఆ నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీస్ అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.