మహిళలకు గౌరవం ఇవ్వడం మన దేశ సంప్రదాయం.. కానీ ఇప్పుడు మర్యాద మాట అటుంచితే మనుషుల్లా కూడా చూడటం లేదు..ఎక్కడ చూసినా కామాంధులు ఎక్కువయ్యారు..సొంత ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది..దాంతో ఇప్పుడు మహిళలు బయటకు వెళ్ళాలన్న కూడా భయపడుతున్నారు.. ఓ మహిళ బాత్రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే.. ఓ వ్యక్తి రహస్యంగా వీడియో ను తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

 

 

వివరాల్లోకి వెళితే.. పక్కింటి మహిళ బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి తొంగి చూస్తూ నీచానికి పాల్పడిన కీచకుడి వ్యవహారం తాజాగా బయటపడింది. రహస్యంగా కెమెరాతో షూట్ చేస్తుండడం గమనించిన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని వడోదరాలో జరిగింది.

 

 


నగరంలోని దభోయ్ రోడ్డులో నివాసం ఉంటున్న మహిళ బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా పక్కింటి వ్యక్తి రాహుల్ పార్మర్(27) దొంగచాటుగా చూసేవాడు. టెర్రస్ పైకెక్కి బాత్రూమ్ కిటికీలో నుంచి రహస్యంగా చూస్తే ఎంజాయ్ చేసేవాడు. అది గమనించిన మహిళ వదిన అతన్ని హెచ్చరించింది. బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే చూడడమేంటని నిలదీసింది. తానేమీ బాత్రూమ్‌లోకి చూడడం లేదని.. బ్రష్ చేసుకునేందుకు వచ్చానంటూ రాహుల్ బుకాయించాడు.

 

 

ఎంత చెప్పినా కూడా కుర్రాడు పద్ధతిని అసలు మార్చుకోలేదు.బాత్రూమ్‌లో ఉన్న ఆమెను సీక్రెట్‌గా కెమెరాతో షూట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిపై అనుమానం కలిగిన మహిళ కిటికీ వైపు చూడడంతో కెమెరాతో షూట్ చేస్తూ కనిపించాడు. ఇక ఆ పోకిరీ వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.తొలుత పోలీస్ అభయం టీమ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పింది. అభయం ప్రతినిధులు పోకిరీకి కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వగలమని.. చర్యలు తీసుకోలేమని చెప్పడంతో ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. స్నానం చేస్తుండగా రహస్యంగా కెమెరాతో వీడియోలు తీసి వేధిస్తున్నాడని చెప్పడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: