
ప్రేమ పేరుతో యువత అడ్డ దారులు తొక్కుతున్నారు.కేవలం అవసరాలకు, శారీరక సుఖం కోసం ప్రేమ అని పేరు పెట్టి చివరికి జీవితాల ను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ వల్ల యువత సినిమాల కు అడక్ట్ అయ్యి అలానే నిజ జీవితాన్ని కూడా అనుభవించాలని ఆశ పడుతున్నారు. దాంతో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.అంతే కాకుండా ఎంతో మంది తమ మానాల తో పాటుగా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు సహజీవనం పేరుతో యువత మోజు తీరే వరకు కలిసి ఉంటున్నారు. తీరా మోజు తీరాక మొహం చాటేస్తున్నారు. అసలు విషయాని కొస్తే.. సహోద్యోగితో ప్రేమ వ్యవహారం నడిపి ఐదేళ్లు సహజీవనం చేసి పెళ్లికి మొహం చాటేసిన యువకుడిని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన శరత్‌బాబు కొన్నాళ్లుగా ఎర్రగడ్డ లో నివాసముంటూ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 1లోని ఓ భవనం లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. బోరబండ ప్రాంతానికి చెందిన ఓ యువతి అదే భవనంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీ లో పనిచేస్తోంది. ఐదేళ్లు క్రితం పరిచయమైనా వీరు ప్రేమికులుగా మారారు.
ఆ ప్రేమ కాస్త సహజీవనం వరకు వెళ్ళింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు తన కోరికలను తీర్చుకున్నాడు. ఇటీవల అమ్మాయి పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. ఇన్నాళ్లూ కలిసి ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుందామని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పంజాగుట్ట పోలీసుల కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని లేకుండా ఊసలు లెక్క బెట్టాలని తేల్చి చెప్పారు. దీంతో పెళ్ళికి అతను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.