ఆడవాళ్ళు ఓర్పు తో ఉంటారన్న విషయం తెలిసిందే..అది కూడా కొంతవరకు మాత్రమే .. వాళ్లకు కోపం వస్తె అపర కాళిలగా విరుచుకు పడతారాన్నది ఇప్పటి కాలం లో జరుగుతూ వస్తుంది.. అయితే చాలా వరకు ఆడవాళ్ళు కోపొద్రులుగా మారి కష్ట పెట్టిన వారిని  వదిస్తూ వస్తున్నారు.. అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. తాళి కట్టిన భర్త తన కష్ఠాలను తీర్చలసింది పోయి తాగొచ్చి చిత్ర హింసలు పెడుతూ వస్తున్నాడు.
ఎంత చెప్పిన వినకుండా రోజు తాగొచ్చి కొడుతున్నాడు..అయితే తాగొద్దని ఎంత  చెప్పినా వినకుండా ఘర్షణ పడుతున్నాడు.. దీంతో విసిగి పోయిన భార్య అతి దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి గొంతు నులిమి చంపేసింది.. 

 

IHG

 


వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని విఠల్‌నగర్‌ లో  వెలుగు చూసింది. గోదావరిఖనికి చెందిన జీదుల రాంబాబు (49) మంథని మండలం విలోచవరంలో ని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల మద్యానికి బానిసైన రాంబాబు రోజూ తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

 

IHG

 

తాగొద్దని ఎంత చెప్పిన కూడా వినకుండా పిల్లలు ముందే ప్రతి రోజు గొడవపడటం సహించలేక పోయింది ఆ భార్య. భర్త వేధింపుల లో విసిగి పోయిన మంజుల అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. నిద్రపోతున్న అతడి చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేసింది. తెల్లవారాక తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని ప్రచారం చేసింది. అయితే రాంబాబు తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలో భర్తను తానే చంపేనని మంజుల అంగీకరించింది.దాంతో పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: