పెళ్లి అనే పవిత్ర బంధంతో ఒకటయిన జంట కుటుంబ విలువలకు లోబడి జీవితాన్ని సాగిస్తుంటారు..పెళ్ళైన కొద్ది రోజులకు భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజం..ఆ గొడవలను అదుపు చేసుకోవాలి కానీ పెంచుకోకూడడు..ఆ చిన్న గొడవలు జీవితాలను పూర్తిగా నాశనం చేస్తే మరీ కొన్ని జీవితాలు మాత్రం అతాలా కుతాలం అవుతున్నాయి.. అలాంటి సమయాల్లో సమన్వయం పాటించాలి లేకుంటే కాపురాలు నాశనం అవుతున్నాయి. అందుకే పెద్దలు ఎదనికైనా ఓర్పుతో ఉండాలని సూచిస్తున్నారు..కోపం కొన్ని సమయాలలో పనికి రాదని పెద్దలు అంటున్నారు..
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో దారుణం సంఘటన వెలుగులోకి వచ్చింది..మద్యం మత్తులో భార్యను అతి దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలులోకి వచ్చింది.మద్యం మత్తు అనేక మంది జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియక... తమవారి ప్రాణాల్నే బలితీసుకుంటున్నారు. తాజాగా తాగిన మత్తులో ఓ భర్త కట్టుకున్న భర్యనే కడతేర్చాడు. బాలింత అని కూడా చూడకుండా ఆమెను చావబాదాడు. భర్త కొట్టిన దెబ్బలు తాళలేక ఆమె ప్రాణాలు వదిలింది. ఈఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని ఇందిరానగర్‌లో నివసించే రుడావత్ అనిల్ వికారాబాద్ జిల్లాకు చెందిన అనిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు.
మొదట్లో బాగానే చూసుకున్న భర్త కొద్ది రోజుల తర్వాత చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు..
కట్నం కావాలని వేధిస్తూ ఉన్నాడు..మద్యం సేవించి ఇంటికొచ్చి భార్యను అతి దారుణంగా హీటర్ తో కొట్టి చంపాడు..కూతురు ఎంత వదిలేయమని బ్రతిమలాడి నా కూడా కసాయి వదలలేదు.దాంతో భార్య మృతి చెందిన విషయం తెలుసుకున్న అతను అక్కడ నుండి పరారయ్యాడు..సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నెలన్నర బాబు తల్లిపాల కోసం గుక్కపెట్టి ఏడుస్తుండటం, మిగిలిన ముగ్గురు పిల్లల తల్లి చనిపోవడంతో పాపం వారికి ఏం చేయాలో తెలయిక అమాయకంగా చూస్తున్నారు. వీరిని చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.