ఈ మధ్య వివాహేతర సంబంధాలు రోజు రోజు కు ఎక్కువవుతున్నాయి. క్షణ కాల సుఖం వావి వరుసలు మరచి అక్రమ సంబంధాలను కొన సాగిస్తున్నారు. అంతే కాకుండా పచ్చటి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న భర్త అడ్డుస్తున్నాడని ఓ భార్య అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా అక్రమ సంబంధానికి అలవాటు పడి మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని అతి దారుణంగా హత్య చేసి చేతులు దులుపుకుంది.
వివరాల్లోకి వెళితే.. తాజాగా మరిది తో రాస లీలలు సాగిస్తున్న వదిన వ్యవహారం బట్ట బయలైందని భర్తని దారుణం గా హత్య చేసిన అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆనంద్ అహిర్వార్, భారతి అహిర్వార్ దంపతులు నివాసముంటున్నారు. కామ కోరికల తో రగిలి పోయిన భారతి స్వయానా భర్త తమ్ముడు రింకుతో శారీరక సంబంధం పెట్టుకుంది. భర్తకి తెలియకుండా రహస్యంగా రాస లీలలు సాగించేది. మరిది తో కామవాంఛలు తీర్చుకుంటున్న వ్యవహారం భర్తకి తెలిసి పోవడంతో దారుణానికి పాల్పడింది.
అతనిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది. మరిది తో కలసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. రింకు మామ కొడుకు కల్లు అలియాస్ అనిల్, సోదరి సీమా అహిర్వార్ సాయం తో అమానుషంగా చంపేశారు. గొంతుకి తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఆనంద్ శవాన్ని బైక్ పై తీసుకెళ్లి పటారా చౌక్ వద్ద పడేసి చేతులు దులుపు కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారణ చేపట్టగా అసలు రంగు బయటకు వచ్చింది.