దేశంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతోతున్నాయి. పగలు, ప్రతీకారాలతో హత్యలు చేసేవారు కొందరు అయితే చిన్న చిన్న కారణాల తో హత్యలు చేసే వారు కొందరు. ప్రతీకారం తీర్చుకోడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. పగను పెంచుకుంటే చిన్నా పెద్దా తేడా లేకుండా చంపేస్తున్నారు. ఎక్కడో చంపి ఎక్కడికో తీసుకొచ్చి డెడ్ బాడీ లను పడేస్తున్నారు. గుర్తు తెలియని మృత దేహాల ఆచూకీ తెలుసుకోవడం పెద్ద సవాలు గా మారింది. తాజాగా గుర్తు తెలియని ఓ యువకుడి మృత దేహం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యం అయింది. దారుణంగా చంపి కవర్లో పెట్టి పడేసారు దుండగులు...
వివరాల్లోకి వెళితే... బురాన్ ఖాన్ చెరువు ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఉండడాన్ని శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం ఏసీపీ జయరాం, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్, ఎస్సై నాగరాజ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని కాళ్లు, చేతులు కట్టి ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఉంచారు. మృతుడి వయసు 20 ఏళ్లు ఉండవచ్చునన్నారు. మృతదేహం కుళ్లి పోయి ఉండడాన్ని బట్టి మూడు నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుడి ఒంటిపై మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించడంతో పాటు ఇతర సమాచారం సేకరించడం వేరే పోలీస్ స్టేషన్ లలో నమోదయిన మిస్సింగ్ కేసులను ఆరా తీస్తున్నారు. గతంలో ఇటువంటి కేసులో ఏమైనా నమోదు అయ్యాయ వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన ఇతర సమాచారం ఏమైనా దొరుకుతుందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.