బెంగళూరులో భార్యను చంపి.. కోల్‌కతాలో అత్తను హతమార్చాడు ఓ ఉన్మాది. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. అల్లుడి నుంచి తప్పించుకున్న మామ పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అటు కర్ణాటక పోలీసులు, ఇటు బంగాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మానవ విలువలు నానాటికీ తరిగిపోతున్నాయి. సొంత బంధువులను తాళి కట్టిన భార్య హింసించడం పని గా మారిపోతుంది. శిక్షలు ఎంత కఠినమైన మనుషుల్లో మార్పు రావడం లేదు.చివరికి అన్ని ప్రాణాలు తీసి తన ప్రాణం తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. ఈ విధంగానే ఎన్నో ఘోరాలు పెరిగిపోతున్నాయి. పోలీసు, కోర్టు అనే విషయాలు మరిచిపోయి హత్య ఆత్మహత్య ఈ రెండు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సొంత బంధువులను కూడా వదలని క్రూరత్వం మనుషుల్లో పెరిగిపోతుంది.
కర్ణాటకలో భార్యను హత్య చేసి.. బంగాల్‌కు వచ్చి అత్తను చంపిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య , తనయుడితో కలిసి బెంగళూరులో వైట్‌ఫీల్డ్ అపార్ట్మెంట్లో ఉంటున్న 42 ఏళ్ల అమిత్ అగర్వాల్ ఓ ప్రైవేటు ఉద్యోగి. సోమవారం సాయంత్రం కోల్‌కతా కంకుర్గచిలోని అత్తారింటికి చేరుకున్నాడు. అత్త లలితా ధన్ధనియాతో చాలాసేపు వాదించాడు. ఆవేశంలో తుపాకీ తీసి అత్తను అత్యంత సమీపం నుంచే కాల్చి చంపాడు.
ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మామ సుభాష్ ధన్ధనియా అల్లుడి ప్రవర్తనకు వణికిపోయాడు. తననూ చంపేస్తాడనే భయంతో అల్లుడున్న గదికి గొళ్లెం పెట్టి, బయటికి పరుగులు తీశాడు. ఇరుగు పొరుగు వారి సాయంతో పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న రెండు మృతదేహాలను చూసి నిర్ఘాంతపోయారు. అత్తను చంపిన అమిత్.. ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. సూసైడ్ నోట్లో భార్యను బెంగళూరులో చంపేసిన తర్వాతే.. అత్తను హత్య చేసేందుకు కోల్‌కతా వచ్చానని రాసిపెట్టాడు అమిత్.