ఇటీవలి కాలంలో వివిధ రకాల లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో గూగుల్ ప్లే స్టోర్ వారికి మరోసారి  పోలీస్ శాఖ లేఖ రాసింది. అయితే ఇప్పటికే పలు లోన్‌ యాప్స్‌ కేసులో పోలీస్ శాఖ పురోగతి సాదించిన సంగతి తెలిసిందే... ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ 200 కు పైగా లోన్‌ యాప్స్‌ ను తొలగించటం జరిగింది. అయితే గత 2 నెలల క్రితం రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ మూడు కమిషనరేట్ పరిధిలో ఎక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా వివిధ పేర్లతో ఉన్న ఈ లోన్ ఆప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గతంలోనూ ఒకసారి పోలీసులు లేఖ రాశారు. అయితే తాజాగా మరికొన్ని లోన్ ఆప్‌లను కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలంటూ పోలీసులు రిక్వెస్ట్ చేస్తూ మరోసారి గూగుల్‌కు లేఖ రాశారు.


ఈ లోన్ యాప్‌ల వల్ల ఎంతోమంది రుణం తీసుకున్న వాళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉన్నారని, లోన్ ఆప్ ప్రతినిధుల వేధింపులు భరించలేక ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, మరో 450కి పైగా లోన్‌ యాప్స్‌ను తొలగించాలని గూగుల్‌కు లేఖ రాశారు. పోలీసుల రిక్వెస్ట్‌తో గూగుల్ యజమాన్యం ఈ లోన్ యాప్స్‌ తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టింది. హైదరాబాద్‌ కమిషనరేట్ నుంచి 288 యాప్స్‌, సైబరాబాద్‌ పరిధి నుంచి 110 లోన్‌ యాప్స్‌, రాచకొండ నుంచి 90 లోన్‌ యాప్స్‌ తొలగించాలని పోలీసులు లేఖ రాశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి వందల సంఖ్యలో బ్యాంక్‌ అకౌంట్లను పోలీసులు సీజ్‌ చేశారు. ఇప్పటివరకు 3 కమిషనరేట్లలో కలిపి 450 లోన్ ఆప్స్ లను తొలగించాలని పోలీసులు లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రూ.కోట్ల నగదు సీజ్‌ చేశారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు చైనా దేశస్తులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: