ఆమె వయసు చాలా చిన్నది. కానీ చాలా జీవితాన్ని చూసింది. అందరి ప్రేమను పొందింది కానీ ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు అనుకుంది అందుకు ఏమాత్రం భయం లేకుండా నవ్వుతూ ఆత్మహత్య చేసుకొని కూడా ఆనందంగా ఆహ్వానించింది. వివరాల్లోకి వెళితే ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ మహిళ పేరు అయేషా. ఈమెకు 2018 రాజస్థాన్ కి చెందిన వివాహం జరిగింది.
మంచి సంబంధం అని ఆమె తల్లిదండ్రులు కష్టపడి ఆమెకు పెళ్లి చేశారు. అప్పటివరకూ ఆమె జీవితం సాఫీగానే ఉంది. కానీ పెళ్లి అయ్యాక అంత దారుణంగా తయారయింది. అయేషా కి పెళ్లయిన కొద్ది రోజుల నుంచి ఆమె భర్త నుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమె భర్త అత్తింటివారు వేధింపులు మొదలుపెట్టారు. ఆమె భర్త అలీ ఖాన్ 2019 అయేషా పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఒకానొక సమయంలో ఆమె భర్త నువ్వు నా వద్దకు రాకుండా ఏదైనా నదిలోకి దూకి చావు అని అన్నాడు. అది ఆయేషా కూడా బెటర్ అని అనిపించింది. ఎవరైనా ఇబ్బంది పెట్టకూడదు అని భావించి సబర్మతీ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ తాను సంతోషంగా వెళ్ళిపోతున్నాను అని తన గురించి ఎవరూ బాధపడొద్దు అని కోరింది తనపై ఎలాంటి ఒత్తిడి లేదంది. నాకు అన్నీ దొరికాయి ఇక స్వర్గం కూడా దొరుకుతుందో లేదో అని చూద్దామని నదిలోకి దూకి వేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. అప్పటికే అయేషా మునిగిపోయింది. సహాయ బృందం అయేషా మృతదేహాన్ని వెలికి తీశారు.