వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన తెలంగాణ మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.. మనోహరా బాద్ మండలం పర్కిబండ గ్రామానికి చెందిన మంచి మురళి (45) మనోహరాబాద్ లోని జేఎంజే స్కూల్ వాచ్ మెన్‌గా విధులు నిర్వహించేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ రోడ్డు ప్రమాదం లో మంచి మురళికి కాలు విరిగింది.దీంతో ఏ పని లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.. చేతిలో చిల్లి గవ్వ లేదని, పిల్లల పరిస్థితి ఎంటి అంటూ ఎప్పుడు అతని తో వాగ్వాదానికి దిగేది.. వారం లో రెండు, మూడు సార్లు అతనికి బుద్ది చెప్తుంది...భర్త ఖచ్చితంగా పని చేయాలని, మిగిలిన వాళ్ళు అంతా కూడా తిడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..
సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి రోకలిబండ తో భర్త మురళిని తల, చాతిపై మోది హత్య చేసింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ కిరణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలా భర్తను చంపడం పై స్థానికులు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఘటన కలకలం రేపుతోంది..